వై సి పీ అభ్యర్తులను గెలిపించుకుందాం – ఎన్. రాజా రెడ్డి పిలుపు           

తిరుపతి ముచ్చట్లు:

ఈ నెల 20వ తేదిన జరగబోయే తిరుపతి కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలల్లో వై సి పీ అభ్యర్తులకు ఓటు వేసి గెలిపించు కుండామని వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం స్తానిక వరదరాజ నగర్ లోని విశ్వం స్కూల్ నందు టౌన్ బ్యాంక్ ఎన్నికలల్లో పోటీ చేస్తున్నా వై సి పీ అభ్యర్తులను గెలిపించాలని కోరుతూ వై ఎస్ ఆర్ టీ యూ తిరుపతి నగరంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవస్త రాల నుండి శాసన సభ్యులు భూమాన కారుణా కర్ రెడ్డి బ్యాంక్ అభివృది కి అనేక చర్యలు తీసుకోవడం జరుగిందని అన్నారు. పోటీ చేసే 12మందికి ఓటు వేయాలని అన్నారు. సెమి అసెంబ్లీ  ఎన్నికలుగా జరిగే టౌన్ బ్యాంక్ ఎన్నికలను వై ఎస్ ఆర్ సి పీ అభ్యర్తులను గెలిపించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి శాసన సభ్యులు భూమాన కారుణా కర్ రెడ్డి, యువ నేత అభినయ్ రెడ్డి ద్వార కనుకగా ఇద్దమని కోరారు. ఈ కార్య క్రమంలో వై ఎస్ ఆర్ టీ యూ సి జిల్లా నాయకులు షేక్ మహ్మద్ రపీ, యునివర్శి టీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్య క్షులు మురళీ రెడ్డి, సుబ్రమణ్యం సే ట్టి, అజీమ్, టాక్సీ యూనియన్ అధ్య క్షులు ఇ. తిరుమల రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు శ్రీమంతుల రామయ్య, శ్రీనివాసం యూనియన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సుధ కర్ రెడ్డి, క్రిష్ణారెడ్డి, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు కడప శ్రీనివాస్, యువరాజ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల కోసం ట్రేడ్ యూనియన్ కోర్ కమిటీని రాజా రెడ్డి కన్వీనర్ గా 10మంది కమిటి సభ్యులను ఎన్నుకున్నారు.

Tags: Let the YCP candidates win: N. Raja Reddy’s call

Leave A Reply

Your email address will not be published.