రాష్ట్రానికి జగన్ అవసరమంటు వివరిద్దాం పదండి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో అవసరమని, ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి వివరించేందుకు వెళ్దాం పదండంటు నియోజకవర్గ పరిశీలకులు జింకా వెంకటాచలపతి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి ఆధ్వర్యంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, గృహసారధులు, కన్వీనర్లు, వలంటీర్లతో శిక్షణా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మానమ్మకం నువ్వే జగన్…ఆంధప్రదేశ్‌కు జగన్‌నే ఎందుకు కావాలి అనే కరపత్రాలను విడుదల చేశారు. వెంకటాచలపతి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా ఎందుకు చేసుకోవాలి, ఆయన చేపట్టిన కార్యక్రమాలు వివరించేందుకు నవంబర్ 1 నుంచి ఇంటింటికి వెళ్లాలన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్నారు. బుక్‌లెట్లు, ప్రశ్నావలితో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల అభిప్రాయం సేకరించాలన్నారు. వలంటీర్లు, గృహసారధులు, కన్వీనర్లు అందరు కలసి ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో బోయకొండ చైర్మన్ నాగరాజారెడ్డి, ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ సచివాలయాల కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహులు, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, రమణ, సుబ్రమణ్యం, గురివిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Let us explain that the state needs Jagan
