పుంగనూరులో మీ సమస్యలు తెలపండి తక్షణమే స్పందిస్తాం – కమిషనర్‌ నరసింహప్రసాద్‌

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజల సమస్యలు ఎలాంటివైనా పరిష్కరించేలా తక్షణమే స్పందిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం కౌన్సిలర్‌ పూలత్యాగరాజు వార్డులో పర్యటించారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు రోజుల్లో నిర్వహించే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయన వార్డు కౌన్సిలర్లతో కలసి చర్చించారు. మంత్రిని ప్రతి ఒక్కరు కలసి తమ సమస్యలు విన్నవించుకునేలా ఉండాలన్నారు. మంత్రి వెంట ఆయా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, మున్సిపల్‌ అధికారులు తప్పక హాజరుకావాలెనని ఆదేశించారు. మంత్రి పర్యటనను జయప్రదం చేయాలని కోరారు. ఈ పర్యటనలో డీఈఈ మహేష్‌, ఏఈ కృష్ణకుమార్‌, సచివాలయ కార్యదర్శి గంగాధర్‌ పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Let us know your problems in Punganur and we will respond immediately – Commissioner Narasimha Prasad

Post Midle
Natyam ad