Natyam ad

జగనన్నకు దేవుడి ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థించుదాం

– చౌడేపల్లె మీదుగా రొంపిచెర్లకుజాతీయ రహదారి ఏర్పాటు
– కేంద్రరోడ్లు, రవాణాశాఖమంత్రి గడ్కరికి సీఎం జగన్‌ వినతి
– త్వరలో శుభవార్త చెబుతానన్న ఎంపీ మ్యిథున్‌రెడ్డి
 
చౌడేపల్లె ముచ్చట్లు:

రోజూ నిద్రలేచి దేవుడికి దండం పెట్టుకొనే ముందు దేవుడి ఆశీస్సులు ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికి ఉండాలని మనమందరం ప్రార్థించుదామని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ , ఎంపీ పివీ. మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లెలో రూ:3 కోట్ల వ్యయంతో ఆదర్శంగా నిర్మించిన మండల పరిపాలన భవన సముదాయంను ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం అహర్నిషలు కృషిచేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికు దృష్ట శక్తులనుంచి కాపాడాలని, ప్రార్థనలు, దువా , ప్రేయర్‌ చేయాలని ప్రజలను కోరారు. బైరెడ్డిపల్లెనుంచి పుంగనూరు, చౌడేపల్లె మీదుగా రొంపిచెర్ల వరకు 4 వ నెంబరు జాతీయ రహదారిగా మార్పు చేయాలని కోరుతూ ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర రోడ్లు, రవాణా భద్రతాశాఖామంత్రి నితిన్‌ గడ్కరిను కలిసి వినతిపత్రం అందజేశారన్నారు. తప్పకుండా రోడ్డును మంజూరుచేయించి మీకందరికీ శుభవార్త చెబుతానంటు ఎంపీ తెలిపారు.గతంలో ప్రభుత్వ పథకాల్లో లబ్దిచేకూరాలంటే ఎన్నో సమస్యలు పడేవాళ్ళం ప్రస్తుతం ఏ ఒక్కరి రెకమెండేషన్‌ లేకుండా ఈ రోజు మీఊర్లో సచివాలయాల్లో ధరఖాస్తుచేస్తే లబ్దిచేకూరుస్తున్నారని చెప్పారు. మనఅందరి దీవెనలతో జగనన్నను కాపాడుకుందామంటూ పిలుపునిచ్చారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Let us pray that God bless Jagannath