స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను  స్మరించుకుందాం

ఘనంగా ప్రారంభమైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాలు
ఈ నెల 27వ తేదీ నుండి జూలై 4వ వరకు  ఉత్సవాల నిర్వహణ
జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు

కడప ముచ్చట్లు:

 

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను  మరువరాదని… వారిని తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్ లోని స్పందన హాలు నందు  “అజాదీ కా అమృత్ మహోత్సవ్”లో భాగంగా… స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడు 125 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు.. బద్వేల్ ఎమ్మెల్యే డా.సుధ, జేసి సాయికాంత్ వర్మ, ఇంఛార్జి డిఆర్వో వెంకటేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు మాట్లాడుతూ..భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు  ఒక మహోజ్వల శక్తి అన్నారు. ఇతను జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు.  సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అని తెలిపారు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే  చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొని వీర మరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు.   ఈ నెల 27వ తేదీ నుండి జూలై 4వ వరకు జరిగే  ఈ ఉత్సవాలలో భాగంగా పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యాసరచన, వక్తృత్వపు పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

 

 

 

ఈ కార్యక్రమాలకు జిల్లా టూరిజం అధికారి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు.బద్వేల్ ఎమ్మెల్యే డా.సుధ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. అటువంటి వ్యక్తి జయంతి ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు.అంతకుముందు శ్రీ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి  వారు  పూలమాలలు  వేసి ఘనంగా నివాళులర్పించారు.  జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి కుల్లాయి స్వామి ,ఎస్ సి  కార్పొరేషన్ ఈడి ,ఇంఛార్జి ట్రైబల్ వెల్ఫేర్  అధికారి వెంకట సుబ్బయ్య,  ఏపీఎంఐపి పీడి మధుసూదన్ రెడ్డి,  గ్రౌండ్ వాటర్  డిడి మురళి,  జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.నాగరాజు,  ఎల్డిఎం దుర్గా ప్రసాద్, రిమ్స్ సూపర్ ఇన్ టెండెంట్ డా.వెంకటేశ్వర రావు, గృహనిర్మాణ శాఖ పీడి కృష్ణయ్య,  జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి బ్రహ్మయ్య,   జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు,  జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి,   అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Let us remember the sacrifices of the freedom fighters

Leave A Reply

Your email address will not be published.