Let us work to ensure that all those who are eligible benefit from Navratnas

అర్హులందరికీ నవరత్నాల్లో లబ్దిచేకూరేలా పనిచేద్దాం

– సచివాలయ సిబ్బంది సమన్వయ సమావేశం
– పారదర్శకంగా సేవచేసి ప్రభుత్వానికి పేరుతెద్దాం
– సచివాలయ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

Date:24/09/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాలను అర్హులందరికి సకాలంలో అందేలా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు కలిసి పనిచేద్దామంటూ ఎంపీడీఓ వెంకటరత్నం సూచించారు. గురువారం స్థానిక అంబేడ్కర్‌ కమ్యూనిటీ భవనంలో మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తో కలిసి శాఖల అనుసంధానంతో సమన్వయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ అభ్యర్థి రామమూర్తి, ఏఐపీపీ మెంబరు అంజిబాబులు ముఖ్య అ•తులుగా హాజరైయ్యారు. ఈ సంధర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల చెంతకు సకాలంలో సులభంగా ప్రభుత్వ సేవలందించడమే ద్యేయంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా మనమందరం నిజాయితీగా విధులు నిర్వహించి ప్రభుత్వం పట్ల నమ్మకం వీశ్వాసం కల్పించాలని కోరారు. సచివాలయ పరిధిలో 70 రకాల రిజిష్టర్లు నిర్వహించాల్సి ఉందని, వీటితో పాటు సిబ్బంది మూమెంట్‌ రిజిష్టర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలకు వివరించాలన్నారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వ్యవస్థలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు సేవలను అభినందించారు. అలాగే మండలానికి మంజూరైన అభివృద్దిపనులను సకాలంలో ప్రారంభించి పనులు త్వరగా పూర్తిచేసి మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో పనిచేయాలన్నారు.ఈ సమావేశంలో ఎంఈఓ కేశవరెడ్డి,డాక్టర్‌ పవన్‌కుమార్‌, ఏఓ జ్యోతమ్మ,ఎంపీటీసీ శ్రీరాములు, ఏఎంసీ డైరక్టర్‌ రవిరెడ్డి , పద్మనాభరెడ్డి, రమేష్‌,చిన్నప్ప,తదితరులున్నారు.

ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:Let us work to ensure that all those who are eligible benefit from Navratnas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *