Let us worship the seed Ganapati for this Vinayaka Chavati

ఈ వినాయక చవితికి విత్తన గణపతిని పూజిద్దాం

-ప్రతి ఇంట్లో వేప చెట్టు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని నిజం చేద్దాం
— మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Date:13/08/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రుల నివాస సముదాయం లోని తన అధికారిక నివాసంలో  రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులకి గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ విత్తన గణపతిని పంపిణీ చేసారు.ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా విత్తన గణపతి ని స్వీకరించడం ఆనందంగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేసారు.ఈ వినాయక చవితికి విత్తన గణపతి ని పూజిద్దామనిప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్,ఎంపీ సంతోష్ కుమార్ సంకల్పానికి సపోర్ట్ చేద్దామని మంత్రి వేముల అన్నారు.

ఆమంచి కృష్ణమోహన్ కు హైకమాండ్ జలక్..?

Tags: Let us worship the seed Ganapati for this Vinayaka Chavati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *