ఎస్‌డిపీఐ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వుత్తుల ర్యాలీ

 Lethal rally under the supervision of SDPI

 Lethal rally under the supervision of SDPI

Date:15/04/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో ఎస్‌డిపీఐ పార్టీ నాయకులు , న్యాయవాది జహుర్‌బాషా ఆధ్వర్యంలో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మూలోని కథువా జిల్లాలో 8 సంవత్సరాల చిన్నారి బాలిక ఐన, ఆసిఫా ను మన హిందూసోదరులు దైవ నిలయంగా బావించే ఒక పవిత్రమైన గుడిలో 8 రోజులు నిర్భధించి ఆ గుడి ఆలయ సంరక్షకుడు , ఆలయ సెక్యూరిటి పోలీస్‌ అధికారి గ్యాంగ్‌రేప్‌ జరిపి చివరికి బండరాయితో తలపై మోది చంపడం మానవత్వానికి, ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా బావించాలి, అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో యోగీ ప్రభుత్వ బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ ఒక మైనర్‌ బాలిక అత్యాచారం జరిపి, అందుకు కంప్లెంట్‌ ఇవ్వడానికి పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఆమె తండ్రిని లాకప్‌డెత్‌ చేసి చంపడం చూస్తే భారతదేశం లౌకికదేశమేన అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంభాలకు న్యాయం చేసి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, అత్యాచారానికి పాల్పడిన వారికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అతిక్‌బాషా, జమీర్‌లాల్‌, బామ్సెఫ్‌, మధుబాబు, శ్రీనివాస్రులు, ఫయాజ్‌, ఆసిఫ్‌, అబ్ధుల్‌రజాక్‌, నజీర్‌, యూసఫ్‌, పాల్గొన్నారు.

Tags: Lethal rally under the supervision of SDPI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *