Natyam ad

ఎయిడ్స్ రహిత సమాజం నిర్మిద్దాం-డాక్టర్ శ్రీనివాస్ గుప్తా, శివకుమార్

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:


నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా, లింగాల మండల పరిధిలోని అంబటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మరియు లింగాల జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులచే
ఉపాధ్యాయులు,విద్యార్థులు ఎయిడ్స్ నిర్మూలనపై అవాగాహన తో పాటు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ గుప్తా, డాక్టర్ శివకుమార్, డాక్టర్ రేఖారానీ
మాట్లాడుతూ ఎయిడ్స్ నిర్ములన చేయాలనీ,   సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా  గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ఏ ఆర్ టి మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్)అను వైరస్ వలన వస్తుంది. ఎయిడ్స్ అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట. హెచ్ఐవి వైరస్ మనుషలకు మాత్రమే సోకుతుంది  ఎయిడ్స్ మీద అవగాహన కల్పించారు. కార్యక్రమంలో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి  శేఖర్, తాహేర్ భాష , సూపర్వైజర్లు వెంకటమ్మ, హెల్త్ అసిస్టెంట్లు శక్రు ,రామచందర్, మల్లేష్, ఏఎన్ఎంలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Let’s build an AIDS-free society-Dr. Srinivas Gupta, Sivakumar

Post Midle
Post Midle