కొమురం భీం ఆశయాలు కొనసాగిద్దాం-మంత్రి అల్లోల
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో విప్లవ వీరుడు, ఆదివాసీల ఆరాధ్యదైవం కొమురం భీం జయంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చైన్ గేట్ ప్రాంతంలో గల కొమురం భీం విగ్రహానికి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జల్ జంగల్ జమీన్ కోసం, ఆదివాసీల హక్కుల కోసంపోరాడిన గిరిజన వీరుడు, ఆదివాసీల ఆరాధ్యదైవం కొమురం భీం ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్ లు, ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు.
Tags: Let’s continue the ambitions of Komuram Bhim – Minister Allola

