పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిద్దాం
-ఎన్. రాజారెడ్డి, నరహరిశెట్టి శ్రీహరిలు ఉద్ఘటన
తిరుపతి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్బంగా వెలగపూడి లోని ఏ. పి. హై కోర్టు సమావేశ మందిరంలో స్వర్గీయ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (AAPS ) వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నారపరెడ్డి రాజారెడ్డి, AAPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరహరి శెట్టి శ్రీహరిలు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాజా రెడ్డి, శ్రీహరిలు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణార్పణ చేసిన పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిద్దామని అన్నారు. తెలుగు రాష్ట్రం ఐక్యత కోసం సమైక్యంద్ర ఉద్యమం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఇప్పుడున్న రాష్ట్రమైన ఐక్యం గా ఉండాలని ఆకాంసించారు. ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున న్యాయవాదులు పాల్గొన్నారు.
Tags: Let’s continue the ambitions of Potti Sriramulu
