తిరుపతిలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేద్దాం
* శత్రుపురం ఆడియో రిలీజ్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిల్చిన “తిరుపతి ఎంపీ గురుమూర్తి”!
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి పుణ్యక్షేత్రంను పర్యాటక రంగంతో పాటు సినీ పరిశ్రమ కూడా అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని దానికి ప్రతిభావంతులైన యువతి యువకులైన డైరెక్టర్లకు నా సహాయ సహకారాలు ఎల్లవేళలా వుంటాయని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి అన్నారు.శత్రుపురం ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని తిరుపతిలోని హోటల్ భీమాస్ రెసిడెన్సిలో అట్టహాసంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ మాట్లాడుతూ శత్రుపురం చిత్రం ఎంతో అద్భుతంగా చిత్రీకరించారని యూనిట్ బృందాన్ని అభినందించారు. హైదరాబాదుకు దీటుగా తిరుపతిలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.స్థానిక నటీనటులను ప్రోత్సహించే విధంగా నిర్మాత,సేవ్ నర్సింగ్ కళాశాల అధినేత,సామాజిక వేత్త ప్రవీణ్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తెలిపారు.తిరుపతిలో రాజమౌళిలా చిత్రాలు తీసే నైపుణ్య వంతులు ముందుకు రావాలని ఎంపీ గురుమూర్తి పిలుపునిచ్చారు.చిత్రం బృందంను అభినందించి ఈ ఆడియా ఫంక్షన్ కు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన సేవ్ నర్సింగ్ కళాశాల అధినేత ప్రవీణ్కు కృతజ్ఞతలన్నారు.డైరెక్టర్ సోమసుందరం,నిర్మాత ప్రవీణ్ లు మాట్లాడుతూ తిరుపతిలో నటీనటులను ప్రోత్సహించే విధంగా స్థానిక పరిసరాలను వినియోగించే విధంగా ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
ఈ చిత్రం ఎంతో అద్భుతంగా వచ్చిందని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ చిత్రంలో భీమాస్ అశోక్ విలన్ గా నటించారని తెలిపారు.ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని నిర్మిస్తున్నట్లు తెలిపారు. సందేశాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని,చిత్రం చిత్రీకరణకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భీమాస్ హోటల్ అధినేత అశోక్, ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో హీరో జీవన్,శ్రీను, వైకాపా సీనియర్ నాయకులు ఎన్ వి ఎస్.మణి,యాoకర్ పుష్ప,శ్రీను తదితరులు పాల్గొన్నారు.తిరుపతి ఎంపీ గురుమూర్తి,ప్రవీణ్ మాట్లాడుతూ గతాన్ని మర్చిపోదాం,కొత్త సమయాన్ని ప్రారంభిద్దాం.మనల్ని బాధపెట్టిన ఘటనలను,మనుషులను క్షమించేద్దాం.పాత బంధాలను కలుపుకుందాం.కొత్త స్నేహాలను స్వాగతిద్దాం.
నూతనం.. ప్రారంభం .. . ఆరంభం .. అనే కొత్త పదాలలోనే ఉత్తేజం దాగి ఉంటుంది. ఎన్నో ఆశలు , ఎన్నో ఆశయాలు , మరెన్నో ఆకాంక్షలు , లక్ష్యాలతో ముందుకు వస్తున్న 2022 అనే నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ అందరికీ ?నూతన సంవత్సర శుభాకాంక్షలన్నారు*?
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Let’s develop the film industry in Tirupati