Natyam ad

రక్తదానం చేసి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడుదాం

-వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

వరంగల్ ముచ్చట్లు:

Post Midle

రక్తదానం  చేసి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకోని వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో
రక్తదాన శిబిరాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఆర్మూద్ రిజర్వ్ మరియు ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో యం.జి.యం రక్తనిధి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి
ఆర్మూడ్ రిజర్వ్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, ఆటో డ్రైవర్లు స్వచ్చందంగా రక్తదానం చేసారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన పోలీస్
అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ వ్యక్తిగతంగా కలుసుకోని అభినందించడంతో పాటు వారికి పండ్లు, సర్టిఫికేట్లను అందజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసులు కేవలం శాంతి
భద్రతలను పరిరక్షించడమే కాదు సేవా కార్యక్రమాల్లోను ముందు వరసలో వుంటారని, ముఖ్యంగా రక్తదానంపై వున్న ఆపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని,

పోలీస్ సిబ్బంది తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్స్ డిసిపి దాసరి మురళీధర్, అదనపు డిసిపిలు సంజీవ్,సురేష్ కుమార్, రాగ్యానాయక్,ఎ.ఓ. రామకృష్ణ
స్వామి, ఏసీపీలు నాగయ్య, అనంతయ్య, సురేందర్, జితేందర్రెడ్డి, భోజరాజు, కృష్ణ, విజయ్ కుమార్, ఆర్.ఐలు శ్రీధర్, చంద్రశేకర్, శ్రీనివాస్, పర్జున్ రాజు, ఇన్స్స్పెక్టర్లు సీతారెడ్డి, సుజాత, వెంకన్న,
శ్రీలక్ష్మీనారయణతో పాటు పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్, యం.జి.యం రక్తనిధి డాక్టర్ ఆశ, మోటివేటర్ కళ్యాణీతో పాటు పోలీస్ యూనిట్ వైద్యులు, ఇతర పోలీస్, పరిపాలన మరియు
యం.జి.యం సిబ్బంది పాల్గోన్నారు.

 

Tags: Let’s donate blood and save three more lives

Post Midle