పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్‌ను అంతం చేద్దాం

Let’s end plastic-damaging plastic

Let’s end plastic-damaging plastic

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:20/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పర్యావరణ కాలుష్యానికి విఘాతం కలిగిస్తూ మానవుని మనుగడకు అడ్డంకిగా మారిన ప్లాస్టిక్‌ వినియోగాన్ని అంతం చేద్దాం తరలిరండి అంటు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో మెప్మా సిబ్బంది , సంకల్ప సోసైటి సభ్యులతో కలసి గోకుల్‌ సర్కిల్‌, ఎంబిటి రోడ్డు, బస్టాండు పాంతాలలో ఆయన స్వచ్చతేహి సేవ, జ్వరాల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌తో సహా సిబ్బంది స్వచ్చతేహి సేవ నినాదంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని , ప్లాస్టిక్‌ను నిషేధించాలని, గుడ్డబ్యాగులు, జనపనార సంచులు వినియోగించాలని, పర్యావరణాన్ని పెంపొందించేందుకు వెహోక్కలు నాటాలంటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా ఆదేశాల మేరకు మున్సిపాలిటిలో ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించామన్నారు. అలాగే భూగర్భజలాల మట్టం పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇండ్ల వద్ద వెహోక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రతి ఇంటి యజమానికి ఆ మొక్కలు పెంచే బాధ్యతను అప్పగించామన్నారు. పట్టణంలోని 24 వార్డుల్లో లక్ష మొక్కలు నాటి ట్రీగార్డులు ఏర్పాటు చేసి, హరిత పుంగనూరుగా మార్చుతామని తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని అన్ని వార్డుల్లోని ప్రజాప్రతినిధులను, విశ్రాంత ఉద్యోగులను , మహిళలను , వ్యాపారులను భాగస్వామ్యులను చేసి, ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. స్వచ్చపుంగనూరుగా మార్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్‌మిషన్‌ కోఆర్డినేటర్‌ రవి, మున్సిపల్‌ ఉద్యోగి శ్రీనివాసులు, సంకల్ప సభ్యులు జానకి, రాజు, రమణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ తదితరులు పాల్గొన్నారు.

చెక్‌ డ్యామ్‌ తెగి వరిపంట నష్టం

Tags: Let’s end plastic-damaging plastic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *