మహమ్మారిని తరిమేద్దాం

– మలేరియా నిర్మూలనకు ర్యాలీ నిర్వహిస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది…

పత్తికొండ ముచ్చట్లు:

 

ఉదృతంగా వ్యాపించకుండా మలేరియా మహమ్మారిని తరిమి కొట్టడానికి అందరూ కృషి చేయాలని మలేరియా యూనిట్ ఆఫీసర్ ఆస్పరి సాయిబాబా అన్నారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాపించ కుండా వ్యతిరేక మాసోత్సవాలు అన్ని గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించామన్నారు. సీజన్ వ్యాధులు వ్యాపించే తరుణంలో ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్న పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఏడాది మలేరియా మందు  గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేస్తున్నామని తెలిపారు. పిల్లలు, వృద్ధులు, బాలింతలు, గర్భిణీలకు జ్వరం వచ్చిన వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. జ్వరం వచ్చిన తరువాత నిర్లక్ష్యం చేస్తే మరిన్ని ఇబ్బందులు కలుగుతాయన్నారు. 2020 లో మలేరియాకు గురైన తుగ్గలి, మద్దికేర, మండలాల పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గ్రామాల్లో దోమలు వ్యాపించినా, జ్వరాలు వచ్చినా వెంటనే గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు స్పందించి సెల్ 9885461909 నెంబర్ కు ఫోన్ చేస్తే మలేరియా కిట్స్ ఇస్తామన్నారు. వాటిని తీసుకెళ్ళి గ్రామ పురవీధుల వెంట పిచికారి చేస్తే దోమలు లేకుండా మలేరియా బారిన పడకుండా ఉంటారంటున్నారు. గ్రామ సర్పంచులు దోమల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Let’s eradicate the epidemic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *