Natyam ad

పల్లెకు పోదాం… పండగ చెద్దాం

హైదరాబాద్ ముచ్చట్లు:

 

సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారి తో హైదరాబాద్ విజయవాడ రహదారి వాహనాల ట్రాఫిక్ జామ్ తో కిక్కిరిసి పోయింది. ట్రాఫిక్ జామ్ తో  రోడ్లన్నీ రద్దీగా మారాయి. కుటుంబ సభ్యులతో కలిసి బస్టాండ్ ల వద్ద బారులు తీరారు….దీంతో బస్టాండ్లు  ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి.తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో బస్సుల్లోనే ప్రయాణించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.  ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.  చాలామంది తమ సొంత వాహనాల్లోనే కాకుండా ఆర్టీసీ బస్సులు ,ప్రైవేట్ వాహనాలలో  ప్రయాణాలు చేస్తున్నారు.  ప్రతి పది నిమిషాలకు ఒకసారి బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఈనెల 10వ తారీకు నుండి 15వ తారీఖు వరకు నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికుల కొరకు రోజువారీగా 100 బస్సులు ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల కొరకు కుడా  ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

 

ప్రయాఱికుల సౌకర్యార్థం కొరకు కూర్చోడానికి సీట్లు,  మొబైల్ టాయిలెట్, వాటర్ ఫెసిలిటీస్, ఎమర్జెన్సీ కొరకు అన్ని రకాల సౌకర్యాలు సమాచార నిమిత్తం కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాలు అధిక డబ్బు చార్జీలు వసూలు  నిలుపుదల కొరకు తగిన చర్యలు చేపట్టారు.మరోవైపు, పండుగ నేపధ్యంలో  హైదరాబాద్ – విజయవాడ హైవేపై  వాహనాల రద్దీ పెరిగింది. గురువారం తో  పోలిస్తే  శుక్రవారం వాహనాల సంఖ్య  రెట్టింపు అయింది.  పంతంగి టోల్ ప్లాజాలో విజయవాడ వైపు 9 ఎంట్రీలను, హైదరాబాద్ 5 ఎంట్రీలను ఓపెన్ చేసారు.  ఫాస్ట్ ట్యాగ్  స్కానింగ్ సమయాన్ని.. 3 నుంచి 2 సెకండ్లకు తగ్గించిన విషయం తెలిసిందే.

 

Post Midle

Tags: Let’s go to the village…let’s celebrate

Post Midle