Natyam ad

పల్లెకు పోదాం..!

విధివిధానాలు ఖరారు..!

అసెంబ్లీ భేటీ తర్వాత ప్రారంభించనున్న సీఎం జగన్..!

ప్రతి సచివాలయం పరిధిలోనూ ఒక్క రోజు కేటాయింపు.!

Post Midle

మండలాధ్యక్షుడు రాత్రికి అక్కడే బస

నేతల మధ్య అంతరాలు తొలగించేలా ఏర్పాట్లు..!

కొత్త వారిని చేర్చుకునే ప్రణాళిక అందరితో కలిసి రాత్రికి గ్రామంలోనే భోజనాలు..!

ఆ గ్రామంలోని లబ్ధిదారుల జాబితా ప్రదర్శన..!

 

అమరావతి ముచ్చట్లు:

అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల చివరిలో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. పల్లెకు పోదాం అనే వినూత్న కార్యక్రమం నిర్వహించేందుకు ఐప్యాక్ ఇప్పటికే సూచించిన మీదట సీఎం జగన్ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో ఈకార్యక్రమ నిర్వహణకు సంబంధించిన అంశాలపై సీఎం జగన్, పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్య నేతలు విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డిలు అటు ఐప్యాక్ టీంతోనూ ఇటు పార్టీ సీనియర్లతోనూ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ బేటీల్లో వచ్చిన అంశాలను పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో చర్చిస్తున్నారు. గడచిన నెల రోజులుగా ఈ కార్యక్రమ నిర్వహణ ఏవిధంగా ఉండాలన్న దానిపై చర్చోపచర్చలు నడిచాయి. తాజాగా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్నదానిపై ఒక రోడ్ మ్యాప్ తయారు చేశారు.

 

 

 

మరీ ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మరింతగా బలహీనపడినట్లుగా అధికార వైసీపీ భావిస్తోంది. ఈనేపథ్యంలో గ్రామ, పట్టణ స్థాయిలో మరింత బలం పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆక్రమంలోనే పల్లెకు పోదాం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి విధి విధానాలను రూపొందించారు. త్వరలోనే దీనిపై రీజినల్ కో ఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ కార్యక్రమాన్ని మరింతగా మెరుగులు దిద్ది ప్రజల ఆదరాభిమానాలు చూర గొనాలన్న లక్ష్యంతో అధికార వైకాపా వేగంగా అడుగులు వేస్తోంది. పార్టీ పెద్దలు
ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం మండలాధ్యక్షడు ప్రతి రోజూ తన మండల పరిధిలోని ఒక సచివాలయాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ సచివాలయానికి ఉదయమే వెళ్లి అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం ఆసచివాలయం పరిధిలో లబ్దిదారుల జాబితాను విడుదల చేస్తారు.

 

 

ఆతరువాత సదరు లబ్దిదారులతో నేరుగా మమేకం అవుతారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం మళ్లీ లబ్దిదారులతో మాటా మంతీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సాయంత్రం పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. మండల అధ్యక్షుడి నేతృత్వంలో గ్రామంలోని పార్టీ ముఖ్య నేతలు భేటీ అవుతారు. ఈ భేటీలో రాత్రి నేతలంతా కలిసి భోజనం చేయనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో లేదా వార్డులో నేతల మధ్య నెలకొన్న అంతరాలను తొలగించడంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు. ఈక్రమంలోనే దీనితోపాటు కొత్తవారిని చేర్చుకునే అంశంపై చర్చిస్తారు. ముందుగా గ్రామంలో ఇప్పటికే ఐప్యాక్ గుర్తించిన తటస్థులను వీలైతే ఈ భోజన కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. ఒకవేళ వారు భోజనానికి రాలేమని, పార్టీ పట్ల సంతృప్తి వ్యక్తంచేస్తే నేతలే వారి ఇళ్లకు వెళ్లి వారిని పార్టీలో చేర్పించేలా మాట్లాడేలా కార్యాచరణ రూపొందించారు.

 

 

 

●కీలకంగా పరిశీలకుల వ్యవస్థ..!

ఇదంతా ఎన్నికల ఏడాది కావడంతో పల్లెకు పోదాం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మ కంగా నిర్వహించాలని అధినేత జగన్ ఇప్పటికే పార్టీ ముఖ్యులకు ఆదేశాలు జారీ చేశా రు. దీనిపై త్వరలోనే రీజినల్ కో ఆర్డినేటర్లతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యా లయంలో ఒక సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలోని గ్రామాలవారీగా జాబి తాతోపాటు మండల అధ్యక్షుని సహకారంతో గ్రామాల్లో కార్యక్రమాల నిర్వహణ తేదీలను ఖరారు చేయడంలో కూడా వీరే కీలకం కానున్నారు. వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందన్నదానిపై వీరు రీజినల్ కోర్డినేటర్లు, పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదికలు అందజేస్తారు. ఈ నివేదికలపై రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ సీనియర్లు, బాధ్యులు పరిశీలనచేసి చివరిగా అధినేత వద్దకు పార్టీ పరిస్థితిని తీసుకెళ్లనున్నారు. వీటి ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగుల పనితీరు ఎలా ఉందన్నది స్పష్టంగా తెలుస్తుందని అధినేత ఆలోచనగా కనిపిస్తోంది.

 

 

ఇదిలా ఉండగా ఏ గ్రామంలో అయితే మండల అధ్యక్షుడు బస చేయనున్నారో అదే గ్రామంలో అదే రోజు రాత్రికి గ్రామ అధ్యక్షులను ఎన్నుకోవడంతోపాటు బూత్ కమిటీల అధ్యక్షులను కూడా ఎన్నుకునే ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు కూడా హాజరు కానున్నారు. అంతేకాకుండా సదరు జిల్లా పరిధిలో ఉన్న రాష్ట్రస్థాయి పదవులు కలిగిన నేతలను కూడా ఈకార్య క్రమానికి ఆహ్వానించనున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే నియమించిన గ్రామ/ వార్డు సచివాలయ కన్వీనర్ల వ్యవస్థ పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కానున్నది. గ్రామానికి ఏర్పాటు చేసిన ముగ్గురు కో ఆర్డినేటర్లు, ఒక కన్వీనర్ ఆ గ్రామంలో పార్టీ స్థితిగతులపై సవివరంగా నేతలకు తెలియజేయనున్నారు. అనంతరం పార్టీ నేతల మధ్య ఏవైనా అంతరాలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని తొలగించే ప్రయత్నం చేసి అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక తటస్టులను కూడా పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

 

 

●అసెంబ్లీ సమావేశాల ముగింపు తరువాత ప్రారంభం..!

ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ సమావేశాల అనంతరం అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించాలని పార్టీ బాధ్యులు నిర్ణం తీసుకున్నా రు. ముఖ్యమంత్రి ఈకార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఒక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకంగా ఉండాల్సిన మండల అధ్యక్షుల ఎంపికను పూర్తి చేశారు. త్వరలో రీజినల్ కో ఆర్డినేట ర్లతో ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఆ సమావేశం అనంతరం దీనికి మరిన్ని మెరుగులు దిద్ది వినూత్న తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి.

 

Tags: Let’s go to the village..!

Post Midle