పుంగనూరు ముచ్చట్లు:
నులిపురుగుల నిర్మూలనకు ప్రతి ఒక్కరు తమ పరిధిలో సహకరించాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. బుధవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పోస్టర్లను విడుదల చేసి ఎంపీపీ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో నులిపురుగులను నిర్మూలించాలని, ప్రభుత్వం అందిస్తున్న మందులు వినియోగించాలని కోరారు. ఆహారంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అలాగే మున్సిపాలిటిలో చైర్మన్ అలీమ్‌బాషా, కమిషనర్ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణపై సమావేశం నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఎంపీడీవో నారాయణ, ఆర్‌డబ్యూజ్లిఎస్‌డీఈఈ వెంకటేశ్వర్లు, ఎంఈవోలు చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్డెన్నశెట్టితో పాటు డాక్టర్లు , సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Let’s help in eradication of nematodes – MPP Bhaskar Reddy