Let's join hands to keep the town clean

పట్టణాన్ని పారిశుద్ధ్యంగా ఉంచేందుకు చేయిచేయి కలుపుదాం

Date:18/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణాన్ని పారిశుద్ధ్యంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు చేయిచేయి కలిపి, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ, బీసీ సంఘ నాయకుడు జయకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం స్వచ్చ సర్వేక్షణ పక్షోత్సవాలలో బాగంగా తిరుపతి రోడ్డులో జయకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో మహిళలు నినాదాలు చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని, తడిచెత్త, పొడిచెత్తను వేరుచేయాలని, హోం కంపోస్ట్ తయారీని విరివిగా చేపట్టాలని , మొక్కలు నాటాలంటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ముఖ్యంగా సీజనల్‌ వ్యాదులు నివారించేందుకు ప్రజలందరు తమంతకు తాముగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చే పట్టి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌, సురేంద్రబాబు, సచివాలయ ఉద్యోగులు , వలంటీర్లు పాల్గొన్నారు.

ఘనంగా దసరా వేడుకలు

Tags: Let’s join hands to keep the town clean

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *