Natyam ad

మీ నాన్నను చంపేద్దాం..!తండ్రిపై కొడుక్కి విషం పూసి..

ఆపై హత్యకు ప్రణాళిక వేసి..
వివాహేతర సుఖం కోసం ప్రియుడితో..

భర్తను హత్య చేయించిన భార్య..

24 గంటల్లో కేసు ఛేదన..
కటకటాల్లోకి నిందితులు…

Post Midle

వివరాలు వెల్లడించిన డిఎస్పీ త్రినాద్

” విజయనగరం  ముచ్చట్లు:

ముప్పై ఆరేళ్ళ ప్రౌడ ఆమె. తీరని శారీరక వాంఛలతో ముప్పై నాలుగేళ్ళ వాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అవకాశం చిక్కినప్పుడల్లా భర్త కళ్ళు గప్పి సంబంధం సాగిస్తున్నా, ఏదో తీరని వెలితి ఆమెను దహించేస్తుండేది. అంతే ఇంకేముంది అడ్డుగా ఉన్న భర్త అడ్డు తొలిగించుకోవాలనుకుంది. తానొకరి భార్య నని, ఈడొచ్చిన పిల్లల బరువు బాధ్యతలు తనపై ఉన్నాయన్న ఇంగితాన్ని మరచిపోయింది. ప్రియుడి ఆలోచన తప్ప, తనకింకేవరితో పని లేదన్న కామాతురంలో కొట్టుమిట్టాడింది. మూడేళ్ళుగా సాగుతున్న తమ చీకటి సంబంధం వెలుగు చూసి కట్టుకున్నోడు గద్దించినా, ప్రియుడ్ని వీడను పొమ్మంది. దీంతో ఆ చక్కటి సంసారంలోకి చిక్కటి చీకటి అలుముకుంది. రోజూ ఇంట్లో గొడవలు, అల్లర్లు, కేకలు. బాల్యం వీడి కౌమారంలోకి అడుగుపెట్టిన పిల్లాడిపై ఈ వాతావరణం చూపింది తీవ్ర ప్రభావం.

 

 

 

గడప దాటుతున్న అమ్మది తప్పా, లేక ఆమెను తిట్టి, కొడుతున్న నాన్నది తప్పా అని తెలియని సందిగ్ధంలో ఆ 15 ఏళ్ల టీనేజ్ పిల్లాడు అమ్మ వైపే మొగ్గు చూపాడు. ఇక అదే అవకాశంగా, తన కన్నతండ్రి పై ఆ పిల్లాడిలో విష బీజాలు నాటడం మొదలు పెట్టింది. తనకు, ప్రియుడికి అడ్డుగా ఉన్న భర్తను శాశ్వతంగా అడ్డు తొలిగించుకోవడం కోసం కొడుకుని పావుగా చేసుకుంది. ‘నాన్నను చంపేద్దాం’ అని కొడుకు ఒప్పుకునేలా తన వైపు తిప్పుకుంది. అందుకు తానే ప్రణాళిక రచించింది. కడుపులో నొప్పి అని కొడుకుతో నాటకమాడించింది. కొడుకుని వెంట బెట్టుకుని హాస్పిటల్ కి వెళ్లిన భర్తను, ప్లాన్ ప్రకారం మాటు వేసి ఉన్న ప్రియుడితో కొట్టి చంపించింది.”
విజయనగరం జిల్లా, గంట్యాడ మండలం, లక్కిడాం గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించి విజయనగరం డిఎస్పీ త్రినాద్ గురువారం వెల్లడించారు.

 

 

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కిడాం గ్రామానికి చెందిన సింగంపల్లి రాము భార్య తులసి కు, సాలూరు మండలం శంబర గ్రామానికి చెందిన బొంగు సన్యాసి నాయుడుకి మూడేళ్ల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. తమ వివాహేతర సంబంధంకి భర్త రాము అడ్డుగా ఉన్నాడని కక్ష పెంచుకున్న భార్య తులసి, ఆమె ప్రియుడు సన్యాసి నాయుడు అతడి అడ్డు తొలిగించుకోవాలని అదును కోసం వేచి చూశారు. ఈ క్రమంలోనే తులసి తన 15 ఏళ్ల కుమారుడిలో తన భర్తపై ద్వేషం పెంచుకునేలా విష పాశం పూసింది. తల్లి దుర్భుద్ధిని గ్రహించే వయసు పరిణితి లేని ఆ పిల్లాడు ‘మీ నాన్న ను చంపేద్దాం’ అందుకు సహకరించాలని ప్రోత్సహించిన తన తల్లి మాటలకు తలొగ్గాడు. అందుకు తగ్గట్టుగా ప్రియుడితో కలిసి ప్లాన్ గీసిన తులసి, కొడుక్కి ఒంట్లో బాగోలేదని, హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని భర్త రాముకి చెప్పింది. వారి మాటలు నమ్మిన రాము ఈనెల 11 న, రాత్రి 9 గంటల సమయంలో కొడుకుని తీసుకుని హాస్పిటల్ కి బయలు దేరాడు. తల్లి ముందే చెప్పిన ప్లాన్ ప్రకారం, లక్ష్మీ సాగరం చెరువు దగ్గరకు వచ్చేసరికి బహిర్భూమికి వెళ్లాలని చెప్పి కొడుకు తండ్రి రాముని అక్కడ నిలుపుదల చేసాడు.

 

 

 

అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న తులసి ప్రియుడు సన్యాసి నాయుడు తన వెంట తెచ్చిన బలమైన కర్రతో రాము తలపై చచ్చే వరకు చావగొట్టాడు. అతడు చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత, దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాము మృత దేహాన్ని చెరువు గట్టు నుంచి రోడ్డు పైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఐతే ఆ సమయంలో వాహన రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండడంతో వారి ప్లాన్ బెడిసి కొట్టింది. దీంతో మృత దేహాన్ని అక్కడే విడిచి పెట్టి పరారయ్యారు. మరుసటి రోజు రాము మరణ వార్త తెలిసిన అతడి సోదరుడు కృష్ణ గంట్యాడ పోలీసులకి పిర్యాదు చేసాడు. దీనిపై ఈ నెల 12 న కేసు నమోదు చేసిన సీఐ మంగవేణి విచారణ చేపట్టి, రాముది హత్యగా నిర్దారించారు. మృతుని భార్య తులసి, ఆమె ప్రియుడు సన్యాసి నాయుడుని బుధవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి, గురువారం రిమాండ్ కి తరలించినట్టు డిఎస్పీ త్రినాద్ తెలిపారు.

 

Tags: Let’s kill your father..! Son poisoned his father..

Post Midle

Leave A Reply

Your email address will not be published.