మనసారా నవ్వుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం..!

lets-laugh-and-we-will-be-happy-and-healthylets-laugh-and-we-will-be-happy-and-healthy

lets-laugh-and-we-will-be-happy-and-healthy

Date:05/05/2019
డోన్ ముచ్చట్లు :

 

మనసారా నవ్వుకుందాం – ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి.

 

ప్రతి సంవత్సరం మే నెల తొలి ఆదివారం నాడు ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని …జరుపుకుంటారు.
మే 05 న ప్రపంచ   నవ్వుల దినోత్సవం సందర్బంగా ….!

 

నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం.. ఆరోగ్యానికి నవ్వు ఒక టానిక్‌. నవ్వు వల్ల ఎండోర్ఫిన్‌ హార్మోన్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి మానసిక వత్తిడిని  సైతం తగ్గించడానికి తోడ్పడుతాయి. తద్వారా శరీరంలో రోగాలను దరిచేరకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు.

 

 

 

 

 

 

 

 

ఓ చిన్న చిరునవ్వు నీ చింతలను తీర్చుతుంది. కొత్త ఆశయాలను  చిగురింపజేస్తుంది. నవ్వు నవ్వించు ఆరోగ్యంగా హాయిగా జీవించు. నవ్వు ముఖం లోని కండరాలను కదిలించి మానసిక ఒత్తిళ్ళను  తగ్గిస్తుంది.  ఒక్కోసారి ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్న మీ చిరునవ్వు వాళ్ళల్లో ఉత్తేజాన్నిఇస్తుంది.మానవ సంబంధాలను అర్ధంచేసుకోవడంలో చిరునవ్వు కు మించిన ఆయుధం మరొక్కటి లేదు. చిరునవ్వు వ్యక్తిత్వానికి ప్రతిబింబం, సంస్కారానికి సజీవ చిత్రం , ఆత్మీయంగా చిరునవ్వు చిందిస్తే సౌందర్యపు వెల్లువ ఇతరుల  మనుసుల్లో ప్రవహిస్తుంది. కావున ఎల్లవేళల చిరునవ్వుతో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి తెలిపారు.

 

 

 

 

 

 

ఒక వ్యక్తి దైనందిన జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఎదురవుతుంటాయి. ఇవి పలురకాలుగా కూడా ఉంటాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నప్పటికీ మనస్సులో దాచుకుని ఎదుటివారితో మాట్లాడేటపుడు.. పెద్దగా మాట్లాడకపోయినా సరే.. ఓ చిరునవ్వు చిందిస్తూ విష్ చేస్తే చాలు. ఆ అనుభూతి, కలయిక వేరేగా ఉంటుంది.
ఎంత సందడిగా తిరుగుతూ ఎన్ని పనులు చేసినా ముఖం మాడ్చుకుని ఉంటే చూసేవారికి ఇబ్బందిగానే ఉంటుంది. సో.. మీ చిరునవ్వు.. మీతో పాటు.. ఎదుటివారిలోను సంతోషాన్ని నింపుతుందని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు.

 

 

 

 

 

 

 

నవ్వడం వల్ల హాయిగా ఉండడమే కాకుండా ఏపని అయినా చురుగ్గా చేసుకోగలుగుతాం. నవ్వు అనేది ఆరోగ్యకరమైన వ్యాయామం అని గమనించాలి. బ్లడ్ ఫ్రెషర్ ను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. నవ్వు వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. మనస్పూర్తిగా నవ్వే నవ్వు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అక్కడ ఆనందం వెల్లివిరిస్తుంది. మనుషుల మధ్య నమ్మకం  పెంపొందించ
బడుతుంది. నవ్వు వల్ల మనస్పర్థలు తొలగిపోతాయి. స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు.

 

 

 

 

అందుకే నవ్వు నాలుగు విధాల మేలు. నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు నవ్వని వారికంటే  ఎక్కువ కాలం జీవిస్తారని కొన్ని సర్వేల ద్వార తెలుస్తుందని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు.

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tags:lets-laugh-and-we-will-be-happy-and-healthy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *