Natyam ad

పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు 100% చేద్దాం..

-అందుకు …ఈ జాగ్రత్తలు పాటించి ఓటు వేద్దాం..

 

చిత్తూరు ముచ్చట్లు:

Post Midle

మీ ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పేరు దాని కోడ్ నెంబర్ తెల్సుకోవాలి.మీ ఓటు ఉన్న పోలింగ్ స్టేషన్ (బూత్) (పార్ట్ నెంబర్ ) నెంబర్ ఓటర్ల జాబితాలో మీ ఓటు క్రమ సంఖ్య తెల్సుకోవాలి.ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్ళిన పిదప 13 A డిక్లరేషన్, 13 B కవర్ A, 13 C కవర్B, Form13D సూచనలు, బ్యాలెట్ ఇస్తారు.వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలి. హడావిడి లేకుండా ప్రశాంతంగా చేస్తే ఓటు చెల్లుతుంది.13A పూరించి అందులో మీకు ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ ను తప్పకుండా రాయాలి. మీ సైన్ ,గెజిటెడ్ సైన్, చేయించాలి. గెజిటెడ్ ఆఫీసర్ ను అక్కడే ఏర్పాటు చేస్తారు.
13B (A ఇన్నర్ కవర్) పూర్తి చేయాలి. 13B లో కూడా మీ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ను తప్పనిసరిగా రాయాలి. అలా వేయనిచో అది ఇన్వాలిడ్ అవుతుంది. టిక్ చేసిన బ్యాలెట్ ను అందులో పెట్టి సీల్ చేయాలి.

 

 

13C ఔటర్ కవర్ లో 13B ఇన్నర్ కవరును, 13A డిక్లరేషన్ లను ఉంచి సీల్ చేసి కవర్ పై వివరాలు పూర్తి చేయాలి.పిదప అక్కడ ఏర్పాటు చేసిన పోస్ట్ బాక్స్ లో పోస్టల్ బ్యాలెట్ కవర్ వేయాలి.జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను విజయవంతం చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. షన్మోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

Tags: Let’s make postal ballot 100% valid..

 

Post Midle