రాజీవ్ పార్కును అందంగా తీర్చిదిద్దుతాం

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా

కడప ముచ్చట్లు:


ఆహ్లాదాన్ని పెంపొందించేలా  రాజీవ్ పార్కును తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అంజాద్ బాషా,నగర మేయర్ సురేష్ బాబు సంయుక్తంగా అన్నారు. బుధవారం స్థానిక నగరంలోని 20వ డివిజన్ ఏ.పీ.హెచ్. బి కాలనీ లోని రాజీవ్ పార్క్ ను పలు రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేసేందుకు కడప నగర మేయర్  సురేష్ బాబు తో కలిసి రాష్ట్ర  ఉపముఖ్యమంత్రి  అంజాద్ భాషా భూమి పూజ చేశారుఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… కడప నగరాభివృద్ది లో భాగంగా 15వ  ఆర్ధిక సంఘం నిధులతో రాజీవ్‌  పార్కులో రూ.58.79 లక్షల వ్యయంతో అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.నగర వాసులు ఆహ్లాదకరంగా గడపడానికి  ఈ పార్క్ నందు  ఓపెన్ ఎయిర్ థియేటర్,కొలను,పాదాచారుల కోసం వాకింగ్ ట్రాక్,లాంప్ పోస్ట్,ఎత్తైన లైటింగ్ స్తంభాలు, ఓపెన్ జిమ్,చిల్డ్రన్ ఆట స్థలం,ఎన్నో రకాల మొక్కలు వంటి మౌళిక వసతులతో ప్రత్యేక శ్రద్ధ తీసికొని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 

 

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి   హయాంలో స్థాపించిన పార్క్ లకు నేడు
అన్ని విధాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసుకోవడం నా అదృష్టం గా భావిస్తున్నానన్నారు.  నగర ప్రజలు సాయంత్రం పూట సేదతీరడానికి ఈ పార్కులుఎంతోఉపయోగపడతాయన్నారు.ఈ రోజు రాజీవ్ పార్క్ లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం  హర్షించదగ్గ విషయం అన్నారు.రానున్న రోజుల్లో కడప జిల్లా అభివృద్ధి లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోగలదని అన్నారు.  ఈ కార్యక్రమంలో నేతలు మాసీమ బాబు, అఫ్జల్ ఖాన్, స్థానిక కార్పొరేటర్ శ్రీ రంజన్ రెడ్డి,ఇతర కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ సిబ్బంది,స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Let’s make Rajiv Park beautiful

Leave A Reply

Your email address will not be published.