ఆదోని జిల్లా సాధనకై  జరుగు బైక్ యాత్రను జయప్రదం చేద్దాం

Date:20/10/2020

-కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక

గోనెగండ్ల ముచ్చట్లు

మన రాయలసీమ జిల్లాలో అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లా పశ్చిమప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని,ముందుగా ఆదోని రెవిన్యూ డివిజన్ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని,

కర్నూలు పశ్చిమప్రాంత అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు పశ్చిమప్రాంత అభివృద్ధి వేదిక మండల గౌరవ అధ్యక్షుడు  అశోక్

కుమార్,  మాట్లాడుతూ ఆదోని రెవిన్యూ డివిజన్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ,నిరక్షరాస్యత తో  కూడిన వలసల ప్రాంతంగా రాష్ట్రంలో ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఈ ప్రాంత

ప్రజల సమస్యలు తీరాలంటే ప్రస్తుత ఏకైక మార్గం ఆదోని జిల్లా గా ఏర్పాటు తోనే కొన్ని సమస్యలు అయిన తొలగి ఈ ప్రాంతం అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా

పార్టీలకు,జెండాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధి ఎజెండాగా ప్రతిఒక్కరు ఐక్యమత్యంతో ఆదోని జిల్లా సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా  కర్నూలు పశ్చిమప్రాంత

అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో గత నాలుగు నెలలుగా ఆదోని జిల్లా సాధన కోసం,పశ్చిమప్రాంత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలతో పాటు ఆగస్టు నెలలో ఆదోని రెవిన్యూ డివిజన్ లోని ఐదు

నియోజకవర్గాలలో ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో ,ప్రజా సంఘాల నాయకులతో కలిసి సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది, ,ఆదోని జిల్లా ఏర్పాటు

ఆవశ్యకత పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.

 

బెయిల్ పై వచ్చి లగ్జరీ జీవితం అనుభవిస్తున్న కేశవరెడ్డి

Tags:Let’s make the bike ride to Adoni district a success

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *