అత్మ గౌరవం కోసమే యాత్ర  రాహుల్ గాంధీని ప్రధాని చేద్దాం

Let's make the Prime Minister of Yatra Rahul Gandhi for the sake of self-esteem
 Date:19/09/2018
మధిర ముచ్చట్లు:
రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న టీఆర్ఎస్ ను గద్దె దింపేందుకే  ఆత్మ గౌరవం యాత్ర చేపట్టినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేసారు. బుధవారం మధిర నియోజక వర్గం ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని విక్రమార్క ఆత్మ గౌరవ యాత్రను మొదలు పెట్టారు.
ఈ సందర్భంగా యాత్ర జమలాపురం నుంచి వెంకటాపురం వరకు సాగింది. వెంకటాపురంలో విక్రమార్క మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిడ్డలు ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆత్మ బలిదనాలతో చలించిన శ్రీమతి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. ఆనాట శాసన సభలో  కేవలం పదిమంది సభ్యులు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్ చేసిందని అన్నారు.
అప్పటి సభలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న నేను విభజన బిల్లును సభలో ప్రవేశ పెట్టినట్లు భట్టి గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక అయిన రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని అయన అన్నారు. కొత్త రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఏర్పాటు చేస్తే,  కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తోందని అన్నారు.
విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం , బడుగు, బలహీన, గిరిజన వర్గాల కోసం  సామాజిక న్యాయం కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని విక్రమార్క చెప్పారు. కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్,  ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
Tags:Let’s make the Prime Minister of Yatra Rahul Gandhi for the sake of self-esteem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *