Date:20/02/2021
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారతదేశ అభివృద్ధి మూలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఆధారపడి ఉన్నట్లు ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే.. సహకార సమాఖ్య మరింత అర్థవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇవాళ నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న మోదీ.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పలు రాష్ట్రాల సీఎంలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పోటీ తత్వాన్ని, సహకార సమాఖ్య విధానాన్ని రాష్ట్రాల మధ్యే కాకుండా.. జిల్లా స్థాయిల్లోనూ బలోపేతం చేయాలని ప్రధాని అన్నారు. కోవిడ్ వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పనిచేశాయో చూశామని, ఈ విధానంలో దేశం సక్సెస్ అయ్యిందని, ప్రపంచం కూడా మనల్ని గుర్తించిందన్నారు. దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండాయని, నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఈ సందర్భంగా మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గత కొన్ని ఏండ్ల నుంచి ఉచితంగా బ్యాంకు అకౌంట్లు కల్పిస్తున్నామని, వ్యాక్సినేషన్ ప్రక్రియ పెరిగిందని, ఆరోగ్య సదుపాయాలు కూడా పెరిగాయన్నారు. పేదల కోసం ఉచిత విద్యుత్తు కనెక్షన్లు, ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. ఈ సదుపాయాలు పేదల జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చినట్లు ప్రధాని వెల్లడించారు.
పుంగనూరులో చట్టాలపై అవగాహన అవసరం – న్యాయమూర్తి బాబునాయక్.
Tags: Let’s move forward with the federal spirit