ప్రజాక్షేత్రంలో పార్టీని గెలిపించేలా ముందుకెళ్దాం

పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి

Date:13/01/2019

పలమనేరు ముచ్చట్లు:

త్వరలో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ కమిటీ కన్వీనర్లు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, ప్రజా క్షేత్రంలో టీడీపీని గెలిపించేలా  ప్రణాళికలతో ముందుకెళ్లాలని పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి సూచించారు. పలమనేరులోని టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం జరిగిన నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని, అది టిడిపికే సాధ్యమన్నారు. బూత్ కమిటీ కన్వీనర్లకు టీడీపీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ పనితీరును కనబరచాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా తటస్థంగా ఉన్న వారిని గుర్తించి మన వైపుకు తిప్పుకునే కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

 

 

 

ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముందని ఆ బాధ్యత నాయకులతో పాటు బూత్ కమిటీ కన్వీనర్లపై ఉందన్నారు. పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసే ప్రతి ఒక్కరినీ గుర్తించడం జరుగుతుందని అటువంటి వారికి సముచిత స్థానం తప్పక కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఇదో సదావకాశంగా భావించి రానున్న ఎన్నికలకు కసితో పనిచేయాలని ప్రజా క్షేత్రంలో ప్రతి ఒక్కరు గెలిచి తీరాలన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం జరగాలంటే అనుభవ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా మనపై ఉందని గుర్తించాలని పేర్కొన్నారు.

 

 

 

భవిష్యత్ తరాలు చెప్పుకునేలా కష్టపడి పనిచేసి అభివృద్ధికి పాటుపడి గుర్తింపుతో పాటు గౌరవాన్ని పొందాలని, పార్టీ ఆదేశానుసారం బూత్ కమిటీ కన్వీనర్లు తమ బాధ్యతలను నిర్వహించాలన్నారు. జనవరి నెల 18న పలమనేరులో చేపట్టనున్న ఎన్టీఆర్ వర్ధంతి రాష్ట్ర స్థాయిలో గుర్తుండిపోయేలా జయప్రదం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏరియా కన్వీనర్లతో పాటు పార్టీ ప్రధాన నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయం లో సంక్రాంతి సంబరాలు

Tags:Let’s move to win the party in the public party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *