Natyam ad

పుంగనూరులో హోరాహోరీగా ఆడుదాం ఆంధ్రా

పుంగనూరు ముచ్చట్లు:

మండల స్థాయి ఆడుదాం ఆంధ్రా క్రీడలు హోరాహోరీగా జరిగాయి. గురువారం రెండవ రోజు మండలంలోని ఏతూరులో పుంగనూరు మున్సిపాలిటి, మండలంలోని 70 టీములు క్రికెట్‌, వాలీబాల్‌ , కబడ్డీ, బ్యాట్మెంటెన్‌ పోటీల్లో తలపడ్డాయి. క్రీడా టీములు ఎక్కువ ఉండటంతో పోటీలు శుక్రవారంతో ముగియనున్నాయి. పోటీలను ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో నారాయణ, కమిషనర్‌ నరసింహప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించి క్రీడలను స్పూర్తిగా తీసుకుని , నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు , సర్పంచ్‌లు, ఎంపీటీలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Let’s play fiercely in Punganur, Andhra

Post Midle