Natyam ad

గ్రామీణ క్రీడాకారులకు ఆడుదాం ఆంధ్రా వేదిక

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ క్రీడాకారులకు ఆడుదాం ఆంధ్రా గొప్ప వేదికగా తయారైందని జిల్లా హార్టికల్చర్‌ ఆఫీసర్‌, పుంగనూరు ప్రత్యేకాధికారి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని ఏతూరు గ్రామంలో మండల స్థాయి పోటీలను ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు పట్టుదలతో పోటీలలో పాల్గొనాలని, దీని ద్వారా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నారాయణ, సచివాలయల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Let’s play for rural sportspersons Andhra Vedika

Post Midle