మన ఊరి బడిని కాపాడుకుందాం, డోన్ యూ టి ఎఫ్..

డోన్ ముచ్చట్లు:

మన ఊరి బడిని కాపాడుకుందాం అని యూటీఫ్ రాష్ట్ర కౌన్సిలర్ వెంకట సుబ్బారెడ్డి అన్నారు, స్థానిక పాత పేట లోని జడ్పీ ఉన్నత  పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశము ను డోన్ యూ టి ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు,ఈ సందర్భంగా వెంకట మాట్లాడుతూ సుబ్బారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ 172 ప్రకారం మన ఊరిలో 1 నుండి 5 వ తరగతి వరకు కొనసాగుతున్న బడి కనుమరుగయ్యే అవకాశం ఉందని కనుక మన ఊరి బడిని మనం కాపాడుకొని నిలబెట్టుకోవాలని రాష్ట్ర కౌన్సిలర్ వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు, గత రెండు సంవత్సరాలుగా మన బడిలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు.నాడు నేడు పనులతో బడులు చూడముచ్చటగా మారాయని,విద్యా కానుకగా బడి సంచిలో పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చారని ,పిల్లల్ని బడికి పంపుతున్నందుకు తల్లికి 15000 రూపాయలు అమ్మ ఒడి కింద ఇచ్చారని అన్నారు.దీంతో బడిలో పిల్లలు బాగా పెరిగారని,ఇప్పుడు ప్రభుత్వం ఎల్ కే జి,యు కే జి చదువులు కూడా ప్రాథమిక విద్య లోకి తెస్తున్నారని దీనివల్ల మన బడి మరింత బలపడుతుందని కానీ మన ప్రాథమిక పాఠశాల నుండి 3,4,5 తరగతుల పిల్లల్ని దూరంగా ఉండే ఉన్నత పాఠశాలకు పంపుతామని అంటున్నారని అన్నారు.ఈ విధంగా చేయడం వల్ల డ్రాప్ అవుట్ పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కావున ప్రాథమిక తరగతులను విద్యా సంస్కరణలు పేరిట విభజించ వద్దు అని డిమాండ్ చేశారు.
ఊరి బడిని మనమే కాపాడుకుందాం అంటూ తల్లిదండ్రులతో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్. జిల్లా కౌన్సిలర్ లక్ష్మి కాంత రెడ్డి, రమేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Let’s protect our homeland, don u t f ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *