మన ఊరి బడిని కాపాడుకుందాం  యుటిఎఫ్

డోన్ ముచ్చట్లు :

మన ఊరి బడిని కాపాడుకుందాం అని యూటీఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు యన్ యస్ బాబు అన్నారు, స్థానిక డోన్ పాతపేట లో సోమవారం ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ 172 ప్రకారం మన ఊరిలో 1 నుండి 5 వ తరగతి వరకు కొనసాగుతున్న బడి కనుమరుగయ్యే అవకాశం ఉందని కనుక మన ఊరి బడిని మనం కాపాడుకొని నిలబెట్టుకోవాలని యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్ ఎస్ బాబు,రాష్ట్ర కౌన్సిలర్ సుబ్బారెడ్డి,జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి పేర్కొన్నారు.
గత రెండు సంవత్సరాలుగా మన బడిలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు.నాడు నేడు పనులతో బడులు చూడముచ్చటగా మారాయని,విద్యా కానుకగా బడి సంచిలో పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చారని ,పిల్లల్ని బడికి పంపుతున్నందుకు తల్లికి 15000 రూపాయలు అమ్మ ఒడి కింద ఇచ్చారని అన్నారు.దీంతో బడిలో పిల్లలు బాగా పెరిగారని,ఇప్పుడు ప్రభుత్వం ఎల్ కే జి,యు కే జి చదువులు కూడా ప్రాథమిక విద్య లోకి తెస్తున్నారని దీనివల్ల మన బడి మరింత బలపడుతుందని కానీ మన బడి నుండి 3,4,5 తరగతుల పిల్లల్ని దూరంగా ఉండే ఉన్నత పాఠశాలకు పంపుతామని అంటున్నారని అన్నారు.ఈ విధంగా చేయడం వల్ల డ్రాప్ అవుట్ పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.కావున ప్రాథమిక తరగతులను విద్యా సంస్కరణలు పేరిట విభజించ వద్దు అని డిమాండ్ చేశారు.
సమావేశం అనంతరం మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సీనియర్ నాయకులు మాణిక్యం శెట్టి,సుబ్బ రాయుడు,లతీఫ్,లక్ష్మి రామ్మూర్తి,వెంకటేశ్వర్లు,హుస్సేన్ బాషా,వెంకటేశ్ గౌడ్,సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Let’s protect our homeland
UTF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *