భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
బాపట్ల ముచ్చట్లు:
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మనుస్మృతిని వ్యతిరేకిద్దాం, ప్రజాస్వామ్య లౌకిక విలువను కాపాడుకుందాం అనే నినాదంతో ఏర్పడ్డ భారత బచావో సంస్థ బాపట్ల జిల్లా సమావేశం బాపట్లలోని అంబేద్కర్ భవన్లో భారత్ భాచావో సంస్థ స్థానిక నాయకులు రాజారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా లోని వివిధ రాజకీయ పార్టీల మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత్ బచావో సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్యుష సుబ్బారావు మాట్లాడుతూ భిన్న భావజాలాలు కలిగిన శక్తులన్నింటిని సమీకరించి ఉమ్మడి శత్రువైన మనువాద సంఘపరివార్ BJP కి వ్యతిరేకంగా పోరాడే విశాల వేదిక భారత్ బచావో యని ఇది రాజకీయ పార్టీ కాదని ప్రతి పక్ష పార్టీల మధ్య పోటీ లేకుండా BJP కి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని ఎన్నికలల్లో పోటీ ఉండేలా ప్రయత్నం చేస్తుందని తెలిపారు. భారత్ బచావో రాష్ట్ర ప్రచార కార్యదర్శి GV రంగారెడ్డి మాట్లాడుతూ భారత్ బచావో మతానికి కాదు, మతోన్మాదానికి వ్యతిరేకమని అన్నారు. BJP పార్టీ ని మరలా కేంద్రంలో అధికారం లోనికి రాకుండా చేయడమే మా లక్ష్యమని అన్నారు. ఈ సందర్బంగా ప్రత్యుషా సుబ్బారావు భారత రాజ్యాంగన్ని కాపాడుతామని, ప్రజాస్వామ్య లౌ కిక విలువలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో వివిధ సంఘాల నాయకులు మాచర్ల మోహన్ రావు, కే. వెంకటేశ్వరరెడ్డి, ఊటుకూరి వెంకటేశ్వర్లు, ప్రొపెసర్ కే. విజయ్ కుమార్, న్యాయవాదులు అక్బర్ భాషా, ఎన్. రాజారెడ్డి, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tags: Let’s save the Constitution of India
