Natyam ad

తంబళ్లపల్లెలో బాబుకు బీసీల పవర్‌ చూపిద్దాం!

– మొరుసు కులానికి టికెట్‌ ఇస్తే సామాజిక న్యాయమా
-అంగళ్లు సభలో బీసీల మాటెత్తని చంద్రబాబు
-బీసీల ఓట్లు అవసరం లేదా
-సోషల్‌ మీడియాలో చంద్రబాబుపై ఆగ్రహం

తంబళ్లపల్లె ముచ్చట్లు:

Post Midle

తంబళ్లపల్లె నియోజకవర్గంలో చంద్రబాబుకు బీసీల పవర్‌ ఏంటో చూపిస్తామని టీడీపీ బీసీవర్గ నేతలు సవాల్‌ విసురుతున్నారు. సామాజిక న్యాయం అంటే బీసీలను మోసం చేయడమేనా? బీసీ నేత శంకర్‌యాదవ్‌కు టికెట్‌ ఇవ్వకుండా అన్యాయం చేసిన చంద్రబాబు ఈనెల 5న (ఆదివారం) తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన ప్రజాగళం సభలో ఆయన పేరెత్తకపోవడ ంపై బీసీ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. రాజకీయాలకు కొత్త అయిన జయచంద్రారెడ్డి మొరుసు కాపు కాబట్టి ఆయనకు టికెట్‌ ఇచ్చి సామాజిక న్యాయం చేశామని చంద్రబాబు సభలో చెప్పారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు టికెట్‌ ఇవ్వకపోగా కనీస గౌరవం ఇవ్వకపోవడంపై సోషల్‌ మీడియాలో చంద్రబాబు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తంబళ్లపల్లెలో టీడీపీని గెలిపించేందుకు అన్నివర్గాలు సహకరించాలని ఒక్కమాట అనకపోవడం, కేవలం కులాన్ని చూసి టికెట్‌ ఇచ్చామని చంద్రబాబు బహిరంగ వేదికపై ప్రకటించడం బీసీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహనికి కారణమైంది. దీనితో అప్పటికప్పుడు బీసీలు టీడీపీ సోషల్‌ మీడియా గ్రూపుల్లో పోస్టులు పెట్టడం వెహోదలైంది.

 

 

 

‘ఈరోజు చంద్రబాబు అంగళ్లు మీటింగ్‌లో వెహోరుసుకాపులకు టికెట్‌ ఇచ్చామని చె ప్పి బీసీ నాయకుడు శంకర్‌ పేరును మర్చిపోయారు. మొరుసు కాపుల ఓట్లు వేయించుకుని గెలవండి చూద్దాం’ అని, ‘బీసీలు అందరూ దీన్ని గమనించారు, ఓటు రూపంలోమన బీసీ పవర్‌ ఎంటొ చూపిద్దాం’. ‘ బీసీల పార్టీ అని బీసీలనే మోసం చేసినారు. బీసీ ఓట్లు టీడీపీ అవసరం లేదు’. ‘నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కలిగిన బీసీలకు చంద్రబాబు ఇస్తున్న గౌరవం ఇదేనా’ అంటూ సోషల్‌మీడియాలో రకరకాల పోస్టులతో హ్గరెత్తిస్తున్నారు. కాగా చంద్రబాబు అంగళ్లు సభకు మాజీ ఎమ్మెల్యే శంకర్‌ వర్గం దూరంగా ఉంది. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు బీసీ సామాజిక వర్గానికి చెందినవే. ఈ ఓటర్లు 56వేలకుపైగా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో 52వేలకుపైగా ఓట్లు ఉండగా అందులో మొరుసు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 35వేల వరకు ఉన్నారు. దీనితో టీడీపీలో బీసీ సామాజిక వర్గ నేతలకు సరైన ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వలేదన్న ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అంగళ్లు సభలో చంద్రబాబు పార్టీలోని అన్ని వర్గాలు అండగా నిలవాలని కాని, ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కాని కోరలేదు. పైగా ఒక సామాజిక వర్గం పేరును మాత్రమే ప్రస్తావించడం నియోజకవర్గ టీడీపీలో అగ్గి రాజేసింది. ఇప్పటికే శంకర్‌కు టికెట్‌ ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఉన్న బీసీలకు చంద్రబాబు మాటలు పుండుమీద కారం చల్లినట్టు అయ్యింది.

Tags:Let’s show Babu the power of BC in Tamballapalle!

Post Midle