దేశభక్తిని పుంగనూరు నుంచి చాటుతాం – కొండవీటి నాగభూషణం

పుంగనూరు ముచ్చట్లు:

దేశభక్తిని పుంగనూరు నుంచి చాటి చెబుతూ పలువురికి ఆదర్శంగా నిలవాలని నిత్యజనగణమన గీతాలాపాన కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కొత్తపేటలో మహిళలతో కలసి గీతాలాపన చేసి, వందన సమర్పణ చేశారు. నాగభూషణం మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో జనగణమన కమిటి సభ్యులు ప్రకాష్‌, అయూబ్‌, దీపక్‌ ఈ కార్యక్రమాన్ని 2018 ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం అందరి సహకారంతో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ డీఈఈ మహేష్‌, వైస్‌చైర్మన్‌ నాగేంద్ర,కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, నరసింహులు, జెపి.యాదవ్‌, తుంగామంజునాథ్‌, వైఎస్సార్‌సీపీ సోషియల్‌ మీడియా జిల్లా కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు మహబూబ్‌బాషా, రాజేష్‌, సురేష్‌, ఖాదర్‌బాషా పాల్గొన్నారు.

 

Tags: Let’s show patriotism from Punganur – Nagabhushanam of Kondaveeti

Leave A Reply

Your email address will not be published.