Let's sing cautions and be afraid of the corona

జాగ్రత్తల పాటిద్దాం కరోనానుంచి భయపడుదాం

-నేటినుంచి నెలాఖరువరకు అవగాహన సదస్సులు
– జాగ్రత్తలు పాటించకుంటే జరిమానాలు

Date:21/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

ప్రతి ఒక్కరూ కరోనా వైరస్‌ భారీనుంచి బయపడేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీఓ వెంకటరత్నం సూచించారు. బుధవారం ఎంపీపీ అభ్యర్థి రామమూర్తి, తహసీల్దార్‌ మురళి, డాక్టర్‌ పవన్‌కుమార్‌, ఏపిఎం నర్వోత్తమరెడ్డిలతోపాటు పంచాయతీ కార్యదర్శులు,వైద్యసిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఇంటినుంచి బయటకొచ్చేటప్పుడు మాస్క్ కచ్చితంగా వాడాలన్నారు. గంటకు కనీసం ఒకసారైనా శానిటైజర్‌ వాడాలన్నారు. లేకుంటే సబ్బుతో నురగవచ్చే విధంగా కడుక్కోలని నినాదాలు చేస్తూ ర్యాలి చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ నారాయణభరత్‌ గుప్తా ఆదేశాలమేరకు ఈనెల 21 వతేదీనుంచి 31 వరకు గ్రామస్థాయిలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ర్యాలీ, అవగాహన సదస్సులు చేపట్టేలా చర్యలు తీసుకొన్నట్లు తెలిపారు. ఈ జాగ్రత్తలను ప్రజలతోపాటు దుఖాణదారులు పాటించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, మనం అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. అలాగే నిర్యక్షంగా వ్యవహరిస్తున్నవారికి జరిమానాలు విధిస్తామని తెలిపారు.

సరస్వతీదేవి గా బోయకొండ గంగమ్మ

Tags: Let’s sing cautions and be afraid of the corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *