పరిశుభ్రతను పాటిద్దాం- ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

చౌడేపల్లె ముచ్చట్లు:

 

ప్రతి ఒక్కరూ వారి నివాస ప్రాంతాలు, చుట్టుప్రక్కల పరిశుభ్రతను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుందామంటూ వైద్యాధికారి పవన్‌కుమార్‌ తెలిపారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ర్యాలీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటివద్ద చెత్త, మురుగునీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. దోమకాటులనుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు దోమతెరలను వాడాలని సూచించారు.•వైద్యసిబ్బంది గ్రామాల్లో పర్యటనకు వెళ్ళి ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలని సూచింఛారు. నీటినిల్వలుతో పాటు తాగునీటి పైపులు లీకేజీ, మురుగునీటి కాలువలు శుభ్రంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించాలని సిబ్బందికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సబ్‌యూనిట్‌ అధికారి చంద్రశేఖర్‌, సిబ్బంది బహుద్దీన్‌, మునీంద్రరాజు, జమున,తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Let’s sing hygiene- let’s maintain health

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *