-విరాళాలు సేకరణ ప్రారంభంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు
కేరళ ముచ్చట్లు:
కేరళ బాధితులు ఆదుకోవాలని శనివారం శనివారం పలమనేర్ పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో విరాళాలు సేకరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ప్రారంభించి మాట్లాడుతూ కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 300 మందికి పైగామృత్యువాతపడ్డారు.వందలాదిమంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. కొంతమంది జాడ కానరావడం లేదు. బాధిత ప్రజలకు జరిగిన నష్టం.పూడ్చలేనిది. వారిని ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు విరాళాలు సేకరణ కార్యక్రమం జరుగుతున్నదని అందులో భాగంగా మొదటి రోజు పలమనేరులో చేస్తున్నామని తెలిపారు పలమనేరు ప్రజానీకం వెరీగుడ్ల ఇచ్చి వరద బాధితులు ఆదుకోవాలని కోరారు .రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంత సహాయ సహకారాలుఅందించినప్పటికీ యావత్ భారత ప్రజానీకం అండగా నిలవాల్సిన సమయమిదని తెలిపారు.విపత్తు వేళ కేరళలోని వయనాడ్‌కు ప్రజలంతా అండగా నిలవాలని సిపిఎం.పొలిట్‌బ్యూరో పిలుపు మేరకు సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలోవిరాళాలు సేకరించి బాధితులకు పంపాలని నిర్ణయించింది.అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆగష్టు 3,4 తేదీలలోప్రజల వద్దకు వెళ్లి బాధితులకు సహాయార్ధం విరాళాలు.సేకరిస్తున్నామని తెలిపారు. పలమనేరు ప్రజానీకం వరద బాధితుల పండగ సహాయం చేయడం అభినందన ఏమని వారికి సిపిఎం తరపున ధన్యవాదాలు తెలియజేశారు.బాధితులకు ఉదారంగా విరాళాలిచ్చి సంఫీుభావాన్ని చాటాలని సిపిఎం చిత్తూరు జిల్లా కమిటీ కోరుతున్నది. కేంద్ర ప్రభుత్వం దీనిని కూడా రాజకీయంగా వాడుకుంటున్నదని రాజకీయాలకతీతంగా వయనాడ్ ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గిరిధర్ గుప్తా,ఓబుల్ రాజు ,భువనేశ్వరి ఈశ్వరయ్య ,ధనలక్ష్మి లక్ష్మయ్య, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.రిలీప్ ఫండ్‌కు డబ్బు
పంపేందుకు అవసరమైన బ్యాంక్ ఖాతా నెం. 50021152209, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చిత్తూరు కి పంపాలన్నారు.
Tags:Let’s stand by the people of Kerala Wayanad.