Let's strike and win the strike

కదం తొక్కుదాం సమ్మె జయప్రదం చేద్దాం  

Date:24/11/2020

ఆదోని  ముచ్చట్లు:

సార్వత్రిక  సమ్మెను  రాష్ట్ర వ్యాప్తంగా ఆశ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని   ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు దస్తగిరమ్మా  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న, సిఐటియు మండల కార్యదర్శి వీరారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సి ఐ టి యు కార్యాలయంలో  ఆశా వర్కర్ల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కోడ్ ల పేరుతో మార్పులు చేసి కార్మిక వర్గాన్ని బానిసలుగా చేస్తుందని ఆగ్రహించారు. కార్మికుల జన్మహక్కు అయిన సమ్మెను హక్కును కాలరాయడం పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచడం వంటి నిరంకుశ విధానాలకు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పై బలవంతంగా రుద్దుతుంది అన్నారు. కార్మిక వ్యతిరేక కేంద్ర విధానాలకు వ్యతిరేకించేందుకు సమ్మెకు కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు పాదయాత్ర వేదికగా ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను బేషరతుగా నెరవేర్చాలని అన్నారు. కనీస వేతనం 18000 ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు పనికి మించిన భారాన్ని మోపుతున్నారని ఈ భారాన్ని కూడా వెంటనే తగ్గించేందుకు ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. కాళీ ఆశ వర్కర్ల పోస్టులను కూడా వెంటనే బేషరతుగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  సిఐటియు నాయకులు ఆశావర్కర్లు నాగమ్మ, జయలక్ష్మి, మల్లేశ్వరి, లత, రాజేశ్వరి, శారద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి అర్బన్ ఏఎస్పీగా ఆరిఫుల్లా

Tags:Let’s strike and win the strike

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *