Let’s work for corona control

కరోనా నియంత్రణ కోసం కృషి చేద్దాం

Date:21/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

సమాజాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలంటు పలువురు పిలుపునిచ్చారు. బుధవారం మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు కలసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు మాస్క్లు ధరించాలని, అనసవరంగా తిరగరాదని, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గోకుల్‌ సర్కిల్‌లో మానవహారం పాటించారు. అలాగే మండలంలోని బసివినాయునిపల్లెలో ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి ఆధ్వర్యంలో కరోనాను నియంత్రించాలంటు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

సరస్వతీదేవి గా బోయకొండ గంగమ్మ

Tags; Let’s work for corona control

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *