ఉన్నత చదువులతోనే పేదరికం నుంచి విముక్తి 

Date:27/05/2020

అమరావతి ముచ్చట్లు:

ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రోజుకో అంశంపై మేధోమథనం నిర్వహిస్తున్న ఏపీ సీఎం జగన్‌  బుధవారం విద్యారంగంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని, చదువుల్లో మార్పు తీసుకురావాలంటే ప్రాథమిక స్థాయి నుంచే మార్పు తీసుకురావాలని వివరించారు. ఇంటర్‌ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే వారి సంఖ్య పెంచాలని సూచించారు. పిల్లలను చదివించాలన్న ఆరాటం ఉన్నా సహకారం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని వివరించారు. పిల్లలు ఉన్నత చదువులు చదివితేనే పేదరికం నుంచి వారి కుటుంబాలు బయటపడతాయన్నారు. రాష్ట్రంలో 45వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే సరైన సౌకర్యాలు లేవని, అందుకే ‘నాడు-నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.

 

 

 

 

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావాలని తొలి అడుగు వేశాం. పేరెంట్‌ కమిటీలను అడిగితే 95 శాతం మంది ఆంగ్ల మాధ్యమం మంచిదన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆపేందుకు కుట్ర పన్నారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే తెలుగును అవమాన పరిచినట్లా?. పెద్ద పెద్దవాళ్లంతా తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు’’ అని జగన్‌ అన్నారు. అగస్టు 3న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని, అదే రోజు జగనన్న విద్యా కానుక అందిస్తామని తెలిపారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొన్నారు.

 

తిరుమల శేషాచలం అడవుల్లో అరుదైన పిల్లులు..

Tags: Liberation from Poverty with Higher Education

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *