గ్రంధాలయాలు విద్యాసంస్థలకు హృదయాలు

Date:19/11/2018
విశాఖపట్నం ముచ్చట్లు:
ప్రపంచంలో మేథోసంపత్తే విలువైన సంపద అని ఆంధ్రాయూనివర్సిటీ  ఆర్ట్స్ అండ్  కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. రామ్మోహన్ రావు తెలిపారు. యునివర్సిటీలోని డాక్టర్ వి.ఎస్. కృష్ణాలైబ్రరీ ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయవారోత్సవాల్లో భాగంగా ఆచార్య కె.రామ్మోహనరావు పాల్గొని ప్రసంగించారు. నిరంతరం కొత్త అంశం పై పరిశోధన చేసే పరిశోధకులకు గ్రంథాలయం తల్లిలాంటిదని పేర్కొన్నారు. పూర్వకాలంలో పరిశోధకులకు గ్రంథాలయమే ప్రధాన ఆధారంగా ఉండేదని, కానీ నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అంటూ అరచేతిలోనే కావాల్సిన సమాచారం నిక్షిప్తం అయి ఉందన్నారు. పరిశోధకులు నిరంతరం కొత్త అంశాల పై సునిశిత పరిశీలన, అన్వేషణ ఉండాలని సూచించారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కడంతో విలువైన సమయం, శక్తి ఆదా అవుతోందన్నారు. అందరూ విధ్యార్ధులు కొత్త అంశాల పై నిరంతరం అధ్యనం చేస్తేనే సమాజానికి విలువైన పరిశోధనలు, మార్గదర్మకాలుగా నిలుస్తాయని చెప్పారు. పరిశోధకులకు లిటరేచర్ ఎంతో ముఖ్యం అని,  దాన్ని పొందేందుకు గ్రంథాలయాలు ప్రధాన మార్గాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. విద్యాసంస్థలకు గ్రంథాలయాలు హృదయాలుగా అభివర్ణించారు. క్షేత్రస్థాయి పరిశోధనల ద్వారా క్వాలిటీ మోథడాలజీ ఉపయోగిస్తే విలువైన పరిశోధనలు బాహ్యప్రపంచానికి అందుబాటులోకి వస్తాయన్నారు.
క్లారివేల్ అనలటిక్స్ సొల్యూషన్ కన్సల్టెంట్ ఎం. రాజేష్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో వెబ్ ఆఫ్ సైన్స్ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. ఈ-బుక్స్, ఈ-జర్నల్స్ల్ ద్వారా పరిశోధకులకు ఎంతో విలువైన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మశీ విభాగాల్లో ఇటీవల కాలంలో సాంకేతికతసాయంతో ఎన్నో విలువైన పరిశోధనలు వచ్చి ప్రజలకు వాటి ఫలాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. డార్టర్ విఎస్.కృష్ణాలైబ్రరీ చీఫ్ లైబ్రేరియన్ ఆచార్య.కె విశ్వేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వర్సిటీలో  ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా విలువైన పుస్తకాలు ప్రదర్శనలో ఉంచామన్నారు. ఆచార్యులు, పరిశోధరుకులు, అధ్యాపకేతర సిబ్బందికి ఉపయోగపడేవిధంగా ఉండేందుకు ఈ నెల 16,19 తేదీల్లో విభిన్న అంశాల పై ప్రత్యేక వర్కుషాప్ లను నిర్వహించాయన్నారు. ఈ సదస్సులో ఎకనామిక్స్ విభాగాధిపతి ఆచార్య పుల్లారావు, ఆచార్య ఎబి.ఎస్.వి. రంగారావు, ఆచార్య నళిని, ఆచార్య వరలక్ష్మి, సుమారు వందమంది ప్రతినిధులు,గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ప్రతినిధులకు సర్టిఫికేట్లు అందజేశారు.
Tags:Libraries heart for educational institutions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *