Natyam ad

మానసిక విజ్ఞానానికి గ్రంధాలయం

పుంగనూరు ముచ్చట్లు:

మానసిక విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంధాలయాలు ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. సోమవారం గ్రంధాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంధాలయంలో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిపికెట్లు, బహుమతులు పంపిణీ చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత అందించడం జరుగుతోందన్నారు. విద్యార్థుల మేదోశక్తిని వెలికితీసేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రంధాలయాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరీయన్‌ తులసినాయక్‌ , విశ్రాంత ఉద్యోగులు వెంకటపతి, రెడ్డెప్పరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Library of Psychology

Post Midle