పుంగనూరులో గ్రంధాలయ వారోత్సవాలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని గ్రంధాలయంలో 56వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో శుక్రవారం కవి సమ్మేళనం నిర్వహించారు. గ్రంధాలయాధికారి తులసినాథ్ ఆధ్వర్యంలో కవిత సమ్మేళనంలో విశ్రాంత తెలుగు పండితులు రామలింగప్ప, సూర్యనారాయణ, నాగభూషణం, ఉర్ధూ పండితులు డాక్టర్ నకివుల్లాఖాన్, హాసినాబేగంలు పాల్గొన్నారు. ఎంతో ఆసక్తి కరంగా కవి సమ్మేళనం నిర్వహించి, పలువురిని ఆకట్టుకున్నారు. కవిసమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు గంగులమ్మ, వెంకటపతి తదితరులు పాల్గొన్నారు.

Tags: Library week celebrations in Punganur
