పుంగనూరులో రైతుల క్షేమం కోసమే నర్సరీలకు లైసెన్సులు -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి.
పుంగనూరు ముచ్చట్లు:
నర్సరీల యాజమాన్యం ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండ రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేసేందుకే నర్సరీలకు లైసెన్సులు ప్రవేశపెట్టిందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరమ్మతో కలసి ఆయన 38 మంది నర్సరీ యజమానులకు లైసెన్సులను పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమం కోసం అనేక మార్పులు చేపట్టిందన్నారు. కల్తీ విత్తనాలను నిరోధించేందుకు లైసెన్సుల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దీని ద్వారా లైసెన్సులు పొందిన నర్సరీలలో వెహోక్కలను రైతులు నిర్భయంగా కొనుగోలు చేయవచ్చనని తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్టికల్చర్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న, ఎంపీడీవో లక్ష్మీపతి, తహశీల్ధార్ వెంకట్రాయులు, రైతులు సురేంద్రరెడ్డి, రామకృష్ణారెడ్డి, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Licenses for nurseries in Punganur for the welfare of farmers – MPP Bhaskar Reddy.
