పలు జిల్లాలో జనజీవనం అస్థవ్యస్థ

హైదరాబాద్ ముచ్చట్లు:


గత వారం కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలో జనజీవనం అస్థవ్యస్థమైంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ పలు గ్రామాలు జలదిగ్బంధం చిక్కకున్నాయి. అయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పంటలు, ఇళ్లు సైతం వరద నీటితో నిండిపోయాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతాలకు వెళ్లారు. అయితే మనుషులు పరిస్థితి ఇలా ఉంటే.. మూగజీవల పరిస్థితి మరి ఘోరంగా ఉంది. ఉవ్వెత్తున వచ్చిన గోదావరి వల్ల గోదావరి పరివాహక ప్రాంతాల్లో జంతు జాలాలకి బతకడమే కష్టమైంది. గోవులకు నిలువ నీడ లేకుండా పోయింది. భద్రాచలం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐదు వరకు గోశాలలు ఉన్నాయి.ఈ గోశాలలో కొన్ని మునిగిపోయాయి. మునిగి పోయిన గోశాల నుంచి గోవులని మరోచోటికి తరలించడం ప్రారంభించారు. గోవులకి పునరావాసాన్ని గోశాల నిర్వాహకులు కల్పించినప్పటికీ ఆ గోవులకు మేత మాత్రం దొరకడం లేదు. గడ్డి అంతా తడిచిపోయింది. గడ్డి మునిగి పోయింది. ఇప్పుడు ఎవరు గడ్డిని దానం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. గడ్డి దొరకక గోవులు నానా అగచాట్లు పడుతున్నాయి. గోశాల నిర్వాహకులు గడ్డి కోసం పలు ఇబ్బందులు పడుతున్నారు.

 

 

పర్ణశాలలో పూజలు
గత వారం తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాలకు వాగులు వంకలు, చెరువులు నిండిపోయాయి. అంతేకాకుండా.. ఎగువన రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురియడంతో.. తెలంగాణలోని జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా వరదలతో పలు గ్రామాలు జలదిగ్బంధలోకి వెళ్లాయి. కొన్ని గ్రామాలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చి జిల్లాలోని ప్రజలపై భయాందోళనకు గురి చేసింది. అయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదలు వెనక్కి వెళ్లకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భద్రాద్రి జిల్లాలోని దుమ్మగూడెం పర్ణశాల ప్రాంతాలలో వరదల కారణంగా 10 రోజుల నుంచి కరెంట్‌ను కట్‌ చేశారు అధికారులు. దీంతో చీకటిలోనే పర్ణశాల రాముల వారి పూజలు నిర్వహిస్తున్నారు పూజారులు.అయితే.. పది రోజుల నుంచి దుమ్ముగూడెం మండల ప్రజలు చీకట్లోనే ఉన్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 10 రోజుల నుండి ఆలయంలో ఆకండ జ్యోతిలో రాములవారు దర్శనమిస్తున్నారు. పర్ణశాల రామాలయం చుట్టూ పాములు వస్తుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి కూడా లేక గ్రామస్తులు అలమటిస్తున్నారు. అంతేకాకుండా సీతమ్మ వారి నారా చీర, పసుపుకుంకుమ.. పరిసర ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉంది. వీటితో పాటు పర్ణశాల ప్రాంతాల్లో ఉన్న షాపులు నీట మునిగాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

Tags: Life in many districts is chaotic

Leave A Reply

Your email address will not be published.