వివేకానందుని జీవితం యువతకు ఆదర్శప్రాయం

Life in Vivekan is an ideal way for young people

Life in Vivekan is an ideal way for young people

– ఉపరాష్ట్రపతి
Date:12/01/2019
రంగారెడ్డి ముచ్చట్లు:
స్వామి వివేకానందుడు భారతీయ సంస్కృతికి ప్రతిరూపమని, యువత దృఢ సంకల్పానికి ప్రతిబింబమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. జాతీయ యువదినోత్సవం సందర్భంగా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. వివేకానందుని బోధనలు అసాధారణమైనవని, కాలదోషం పట్టనివని, అవి అన్ని కాలాలాకు వర్తించే నిరంతర గంగాప్రవాహాలని తెలిపారు. భారతీయ సంస్కృతిలో తాత్వికమైన, సమీకృతమైన, సార్వత్రికమైన లక్షణాలు ఉన్నాయని, ప్రపంచం ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు.
వైవిధ్యమైన మతాలను, సాంస్కృతిక నమ్మకాలను, వివిధ అభిప్రాయాలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి, వివిధ అభిప్రాయాల మధ్య చక్కని వారధి నిర్మించిన ఘనత వివేకానందుని సొంతమని, వారి బోధనలను జీవితంలో ఆచరించడం ద్వారా ప్రజా జీవితాల్లో సానుకూలమైన మార్పులు సాధ్యమని అభిప్రాయపడ్డారు. 125 ఏళ్ళ క్రితం చికాగో సర్వమత సమ్మేళనంలో వివేకానందుని ప్రసంగం యావత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేసిందని, వారి వాక్పటిమ, నిజాయితీతో కూడిన సంభాషణ ప్రతి ఒక్కరినీ సమ్మోహితుల్ని చేసిందని ఉపరాష్ట్రపతి తెలిపారు.
మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, ధైర్యం లాంటి అంశాల గురించి వారి తెలియజేసిన సూక్తులు యువతకు ఆదర్శనీయమని, మనిషి శరీరం ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా బాధలను అనుభవించి తీరాలన్న వారి మాటలను ఆదర్శంగా తీసుకుని వారు చెప్పినట్లు దృష్టిని బాధలపై కాకుండా, పరిష్కారం మీద ఉంచాలని తెలిపారు. ఆధునిక యువత అధ్భుతాలు సాధించగలని వివేకానందుడుడు మనసా వాచా, కర్మణా నమ్మారని, యువశక్తిని ప్రపంచానికి తెలియజేసిన వారి జీవితం యువతకు ఆదర్శనీయమని తెలిపారు. వివేకానందుని సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయని, ముప్పైతొమ్మిదేళ్ళ వయసులో తనువు చాలించిన వివేకానందుడు సంపూర్ణంగా భారతీయ యువత మనసుల్ని ప్రతిబింబించారని తెలిపారు. వివేకానందుని మాటలను ఆచరణలో పెట్టడం ద్వారా జీవితంలో యువత మరింత ఎత్తుకు ఎదగాలని  ఆకాంక్షించారు.
Tags:Life in Vivekan is an ideal way for young people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *