12 ఏళ్ల తర్వాత గండిపేట గేట్లు ఎత్తివేత

హైదరాబాద్  ముచ్చట్లు:

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మూసీ నదిలో వరద ఉధృతి పెరిగింది.. శంకర్‌పల్లి సహా మిగత ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుంది.. భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో 6 ఫీట్ల మేరా 12 గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇక, దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు.. నార్సింగి నుండి అప్పా వెళ్లే దారిని పూర్తిగా మూసి వేశారు పోలీసులు.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. గండిపేట మండలంలోని పలు గ్రామాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి… ఇక, 2010 సంవత్సరంలో 12 గేట్లు ద్వారా నీటిని విడుదల చేశారు.. అధికారులు.. అంటే.. మళ్లీ 12 గేట్లను.. అది జులై నెలలోనే ఎత్తివేయడం 12 ఏళ్ల తర్వాత ఇది తొలిసారి..ముసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.. నగరంలోని మూసారాంబాగ్‌ వద్ద బ్రిడ్జిని ఆనుకుని మూసీ నది ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్‌ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పురాతన బ్రిడ్జి కావడం.. ఆ బ్రిడ్జి పై నుంచి మూసీ నది ప్రవహించే అవకాశం ఉండడంతో.. రాకపోకలు నిలిపివేశారు. ఇవాళ రాత్రికి బ్రిడ్జిపైకి వరదనీరు చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇదే సమయంలో.. మూసీ నది వరద ఉద్ధృతి పెరిగితే.. చాదర్‌ఘాట్‌లో లెవెల్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ నిలిపివేస్తామని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు.. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.. ఇక, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే.. జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ 040-21111111కు సంప్రదించాలని అధికారులు సూచించారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

 

Tags: Lifting of Gandipet gates after 12 years

Leave A Reply

Your email address will not be published.