Lightning attacks on saplings

నాటు సారా తయారీ బట్టీలపై మెరుపు దాడి

– 300 లీటర్ల ఊట సారా ధ్వంసం

Date:07/12/2019

పుంగనూరు, ముచ్చట్లు:

నాటు సారా తయారీ బట్టీలపై మెరుపు దాడులను పోలీస్, ఎక్సైజ్ పోలీసులు నిర్వహించారు. మండలంలోని నల్లగుట్లపల్లి తాండలో శనివారం ఉదయం ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్ఐ రవికుమార్ లు తమ సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఇందులో సారా తయారీకి సిద్ధంగానున్న ఊట సారాను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సారాను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. అంతేకాకుండా సారా తయారీపై ఆధార పడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఇస్తోందన్నారు. అయినా కొంత మంది ప్రభుత్వ ఆదేశాలను పక్కనబెట్టి సారా తయారీపై మొగ్గు చూపుతున్నారని సమాచారం వచ్చిందన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

 

బీచ్ ని శుభ్రం చేసిన సిఐఎస్ ఎఫ్ జవాన్లు

 

Tags:Lightning attacks on saplings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *