నేతన్నల జీవితాల్లో వెలుగులు

జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడప ముచ్చట్లు:

“వైఎస్ఆర్ నేతన్న నేస్తం” ద్వారా రాష్ట్ర ప్రభుత్వం.. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడం.. గర్వించదగ్గ విషయమని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజుప్రశంసించారు.
గురువారంరాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పెడన బహిరంగ సభ నుంచి.. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి “వైఎస్ఆర్ నేతన్న నేస్తం” నాలుగవ విడత లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ విసి హాలునుండి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తోపాటు.. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, జేసీ సాయికాంత్ వర్మ  హాజరయ్యారు.
వీడియో కాన్ఫరెన్సు ముగిసిన అనంతరం.. స్థానిక విసి హాలులో 4వ ఏడాది “వైఎస్ఆర్ నేతన్న నేస్తం” పథకం ద్వారా జిల్లాలోని 8,545 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.20,50,80,000ల మెగా చెక్కును.. జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జేసీ సాయికాంత్ వర్మ లు లబ్దిదారులకు అందజేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ… ప్రస్తుతం “వైఎస్ఆర్ నేతన్న నేస్తం” పథకం ద్వారా జిల్లాలో 8,545 మంది లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.24 వేలు చొప్పున  రూ.20.50 కోట్లు అందడం ఆనందదాయకమైన విషయం అన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ ఒక్క నిరుపేద కూడా.. సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనేదే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని, ఆ దిశగా ముఖ్యమంత్రి అన్ని రకాల సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తూ వస్తున్నారన్నారు. ఏవైనా కొన్ని కారణాల వల్ల “వైఎస్ఆర్ నేతన్న నేస్తం”

 

 

 

ద్వారా ప్రస్తుతం లబ్దిపొందలేక పోయిన వారు స్థానిక సచివాలయాల్లో మళ్లి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హత ఉండీ లబ్ది చేకూరడంలో ఏమైనా సమస్యలు ఉంటే సంబందిత శాఖ జిల్లా అధికారులను, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబరు : 1902 కు కాల్ చేసి తెలుపవచ్చన్నారు. అనంతరం కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి,  మాట్లాడుతూ..  కరోనా కష్ట కాలంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతన్నలకు.. ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకం ద్వారా.. 1, 2, 3వ విడతల్లో.. నిరాటంకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది కూడా 4వ విడత ప్రభుత్వ సాయాన్ని అందుకున్న నేతన్నలందరికీ అభినందనలు తెలిపారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని రకాల ప్రజల సమస్యలను.. నేను చూశాను, నేను విన్నాను, నేను వున్నాను.. అని చెప్పిన మాట ప్రకారం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే.. 95% పైగా హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో పద్మశాలీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్ పర్సన్ జింకా విజయలక్ష్మి, కృష్ణ బలిజ, పూసల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పసుపులేటి విజయ కుమారి, వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి మనోజ్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్షి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు భీమయ్య, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, చేనేత కార్మిక లబ్ధిదారులు, చేనేత కార్మిక సంఘాల నేతలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Lights in the lives of leaders

Leave A Reply

Your email address will not be published.