Give corona test results quick

సీజనల్ వ్యాధిలా..కరోనా

Date:18/09/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతగా బాధిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఇతర దేశాలతో పోలిస్తే ప్రభావం మరింత తీవ్రంగా లేదని అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే కరోనా సీజనల్ వ్యాధిలా మారబోతోందని అధ్యయనాల్లో తెలుస్తోంది.కరోనా మహమ్మారి నుండి పోరాడాలి అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలని వైద్యులు ఎప్పటి నుండో చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక కరోనా ఓ సీజనల్ వ్యాధిలా మారిపోబోతోందని చెబుతూ ఉన్నారు. సామాజిక రోగ నిరోధకత ఎంత త్వరగా సాధిస్తే కరోనా  అంత త్వరగా  సీజనల్ వ్యాధిగా మారుతుందని లెబనాన్‌లోని బీరూట్ అమెరికన్ యూనివర్సిటీ చెబుతోంది.శ్వాసకోశ సంబంధ వైరస్‌లు సీజన్ల వారీగా ఎలా విజృంభిస్తున్నాయి? భవిష్యత్తులో ఈ వైరస్ ఎలా మార్పులు చెందబోతోందన్న అంశాలపై పలువురు అధ్యయనాన్ని  చేప్పట్టగా ఈ విషయాలు బయటకు వచ్చాయి.

 

 

హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే వరకు ప్రతీ సీజన్‌లోనూ ఇది పలుమార్లు వస్తూనే ఉంటుందని అధ్యయనం వివరించింది. హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగితే  కరోనా వ్యాప్తి దానంతట అదే తగ్గిపోతుందని, తర్వాత సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే వైరస్ కనిపిస్తుందని ఈ పరిశోధనలు చేసిన వారు చెబుతూ ఉన్నారు. కరోనాకు ప్రజలు అలవాటు పడాలని.. మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి వాటి ద్వారా కరోనా సోకకుండా జాగ్రత్త పడాలని కోరారు.భారత్ లో గడిచిన 24 గంటల్లో 90,122 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50,20,359కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 39,42,361 మంది కోలుకోగా.. 9,95,933 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 1,290 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 82,066కి పెరిగింది. కరోనాతో మరణిస్తున్న వారిలో దాదాపు 70 శాతానికి పైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కరోనా బాధితుల రికవరీ రేటు 78.5శాతం ఉండగా.. మరణాల రేటు 1.63శాతంగా ఉంది.

ఎంపీలో కాంగ్రెస్ హ్య‌పీ

Tags: Like a seasonal disease..Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *